జియో పైబర్ ఫ్లాన్లు : రూ.399లకే కొత్త ప్లాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

డేటా సంచలనం, ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ఆఫర్ రిలీజ్ చేసింది. ప్రత్యేకించి జియో ఫైబర్ యూజర్ల కోసం జియో ఫైబర్ కొత్త ప్లాన్ రిలీజ్ చేసింది. ఈ ప్లాన్ నెలవారీ ప్రారంభ ధర రూ.399లతో అందిస్తోంది.

సెప్టెంబర్ 1 నుంచి ఈ ఫైబర్ ప్లాన్ అందుబాటులోకి రానుంది. రిలయన్స్ జియో అందిస్తున్న అతి చౌకైన ధరకే అందిస్తోంది. ఈ ప్లాన్ కింద డేటా స్పీడ్ జియో 30Mbps అందిస్తోంది. గతంలో డేటా లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 1Mbpsకు తగ్గేది.ఈ ప్లాన్ కింద ఉచిత కాల్స్ అందిస్తుంది. రూ.999 పేరిట ప్రకటించిన మరో ప్లాన్ లో 150Mbps స్పీడ్ డేటా అందిస్తోంది. 11 OTT యాప్స్‌ను ప్లాన్‌లో భాగంగా అందిస్తున్నారు.అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్ స్టార్ , G5, సోని లివ్ వంటివి అందిస్తున్నారు. రూ.1499 ప్లాన్ లో నెట్ ఫ్లిక్స్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప్లాన్‌లో 300Mbps వరకు డేటా స్పీడ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Related Posts