J&K: IED detected on Jammu-Poonch highway

జమ్ముకశ్మీర్ లో కలకలం : భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల ప్లాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జమ్ముకశ్మీర్ లో కలకలం చెలరేగింది. ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు అమర్చారు. అయితే పోలీసులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

జమ్ముకశ్మీర్ లో కలకలం చెలరేగింది. ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు అమర్చారు. అయితే పోలీసులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉగ్రదాడుల కుట్ర భగ్నమైంది. మంగళవారం(నవంబర్ 19,2019) ఉదయం పూంచ్ సెక్టార్ లోని రాజౌరి దగ్గర హైవేపై శక్తిమంతమైన ఏడు ఐఈడీ పేలుడు పదార్దాలు గుర్తించారు. వెంటనే బాంబు స్వ్కాడ్ రంగంలోకి దిగింది. పేలుడు పదార్ధాలను నిర్వీర్యం చేశారు. ఘటనా స్థలంలో ఓ వైర్ లెస్ సెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూంచ్ సెక్టార్ లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

పూంచ్ జిల్లాకు సమీపంలోని కల్లార్ మోర్ ప్రాంతంలో ఆర్మీ పెట్రోలింగ్ పార్టీ తిరుగుతుండగా పేలుడు పదార్ధాలను గుర్తించింది.

పేలుడు పదార్ధాలు బయటపడటంతో పోలీసులు, బలగాలు అప్రమత్తమయ్యాయి. పూంచ్ సెక్టార్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జమ్ము-పూంచ్ హైవేని బ్లాక్ చేశారు. విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం వేటాడుతున్నారు. బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ పేలుడు పదార్థాలు అమర్చినట్టు తెలుస్తోంది.

Related Tags :

Related Posts :