JN Rao condemn Chandrababu's comments

చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన జీఎన్ రావు : అన్ని ప్రాంతాల్లో పర్యటించే నివేదిక

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజధానిపై రిపోర్టుపై చంద్రబాబు చేసిన విమర్శలను రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌రావు తప్పు పట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. తమ కమిటీ నివేదికపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవాలన్నారు. సీఎం సలహాదారు అజేయకల్లాం ఇ్చచిన రిపోర్టును.. తాము ఇచ్చామని చంద్రబాబు చెప్పడం అసంబద్ధమన్నారు. తమ కమిటిలోని సభ్యులంతా అపార అనుభం కలవారన్నారు జీఎన్‌రావు. అన్ని ప్రాంతాల్లో పర్యటించే నివేదిక రూపొందించామన్నారు.

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సంప్రదించి ప్రజల సమాచారాన్ని సేకరించామని తెలిపారు. అన్నిశాఖల అధికారులు, హెచ్‌వోడీలను సంప్రదించి డేటా సేకరించామని చెప్పారు. ప్రజల అభిప్రాయాన్ని చెప్పాలని బహిరంగంగానే పత్రికా ప్రకటన ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నివేదిక రూపొందించామని తెలిపారు. 

రాజధాని కోసమే కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే రిపోర్టును రూపొందించామని చెప్పారు. తమకు ప్రభుత్వం, సీఎం నుంచి సూచనలు, సలహాలు రాలేదన్నారు. కేవలం ప్రజల అభిప్రాయాలు, ఉన్నటువంటి వాస్తవాలకు సంబంధించి మాత్రమే రిపోర్టు రూపొందించామని చెప్పారు. నిన్న మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జీఎన్ రావు పూర్తిగా ఖండించారు. చంద్రబాబు చెప్పినవన్ని అవస్తవాలని..ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యాలు ఉన్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. 

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై ఏర్పాటైన జీఎన్‌ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది. భవిష్యత్‌లో నిర్మించే వాటిని మెట్ట ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించింది. ఏపీలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని రాజధానిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర అభివృద్ధి ఏవిధంగా ఉండాలి.. రాజధాని ఎలా ఉండాలనే అంశాలపై అధ్యయనం చేసిన కమిటీ..  తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు సీఎం జగన్‌కు 125 పేజీల నివేదికను సమర్పించారు. 

గతంలో రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రిపోర్టునూ పరిశీలించామని జీఎన్‌రావు చెప్పారు. ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని వెల్లడించారు. తీర ప్రాంతంపై అభివృద్ధి ఒత్తిడి ఎక్కువుందని, అభివృద్ధిని మిగతా ప్రాంతాలకూ విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని ప్రకటించారు. సమగ్ర అభివృద్ధి కోసం అనుసరించాల్సిన విధానాలను… ప్రభుత్వానికి సిఫార్సు చేశామని జీఎన్‌రావు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి జిల్లాలోను పర్యటించి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నామని, వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేశామని కమిటీ పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ… అభివృద్ధి చేసుకోవాలని కమిటీ సభ్యులు సూచించారు.

 

వరద ముంపులేని రాజధాని ఉండాలని జీఎన్‌రావు కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేసింది. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉందని తెలిపింది. పట్టణీకరణంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమైంది. దక్షిణకోస్తా, సీమ ప్రాంతాల్లో పట్టణీకరణ తక్కువ. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి తప్పనిసరి అని సూచించామని కమిటీ తెలిపింది. నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల ఏర్పాటుకు సిఫార్సు చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కలిపి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణాను కలిపి మధ్య కోస్తా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో దక్షిణ కోస్తా, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో రాయలసీమ రీజియన్లుగా విభజించాలని పేర్కొంది. కర్ణాటక తరహాలో రీజినల్‌ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలన్న కమిటీ.. ఏపీ రాజధానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

అమరావతి, మంగళగిరి కాంప్లెక్సు, విశాఖ మెట్రో సిటీ, కర్నూలు, రాయలసీమకు సంబంధించి మూడు కీలకమైన ప్రతిపాదనలు చేసింది. అమరావతి పరిధిలో హైకోర్టు బెంచ్‌తో పాటు అసెంబ్లీ, ప్రభుత్వ క్వార్టర్లు, గవర్నర్‌ నివాస భవనం ఉండాలని సిఫార్సు చేసింది. విశాఖలో సచివాలయం, హైకోర్టు బెంచ్‌, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని పేర్కొంది. విశాఖలో అసెంబ్లీ వేసవికాల సమావేశాల నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఇక కర్నూలులో హైకోర్టు, దానికి సంబంధించిన కోర్టులన్నీ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించింది. శ్రీబాగ్‌ ఒప్పందంలో ఈ విషయం ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. 

Related Tags :

Related Posts :