లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

ఉద్యోగం పోయినా బతగ్గలం..ఆ స్కూటీయే ఫుడ్ సెంటర్ గా

Published

on

Haryana man scooty food center : ఉద్యోగం పోతే బతకలేమా? ఇక జీవితం పోయినట్లేనా? ఉద్యోగం లేనంత మాత్రాన తిండి తినలేమా? బతకలేమా? బట్టకట్టేలేమా? బతుకుతాం..అంతకంటే బాగానే బతుకుతాం అని నిరూపిస్తున్నాడో వ్యక్తి.


కరోనా కష్టంతో నెలకు రూ.20వేలు వచ్చే ఉద్యోగం పోయింది. ఇద్దరు కూతుళ్లు..ఒక కొడుకు భార్యా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత ఉంది. భయపడ్డాడు. బాధపడ్డాడు. కానీ ధైర్యం తెచ్చుకున్నాడు. కష్టాన్ని నమ్ముకున్నాడు. చక్కగా టిఫిన్ సెంటర్ వ్యాపారం చేస్తూ హాయిగా ఉన్నాడు. ఇక ఉద్యోగం చేయనే చేయను..ఇదే బాగుంది అంటున్నాడు కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయిన నిరుద్యోగిగా మారిన హర్యానా యువకుడు బల్వీర్ సింగ్.కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి..రోడ్డునపడ్డ చాలామంది తమలో ఉన్న ప్రతిభతో ఉపాధిని సృష్టించుకుని కొత్త జీవితాలను ప్రారంభించారు. అటువంటి వ్యక్తే హర్యానాలోని గుర్‌గావ్‌కు చెందిన బల్వీర్ సింగ్. 47 ఏళ్ల వయస్సులో బల్వీర్ సింగ్ కరోనాకు ముందు ఒక హోటల్‌లో పనిచేసేవాడు.


భార్యను ఏడాదిగా బాత్రూమ్ లో బంధించి..తిండి పెట్టకుండా చిత్రహింసలు


లాక్‌డౌన్ కారణంగా హోటల్‌లో పనిచేస్తున్న 50 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగం కోల్పోయిన బల్వీర్ సింగ్‌కు ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితి. కుటుంబాన్ని పోషించుకోవటానికి చేతిలో ఉన్న కొంచెం డబ్బు అయిపోయింది.


తరువాత ఏం చేయాలో తెలియలేదు. రోజు స్కూటీపై హోటల్ కు వెళ్లటం గుర్తుకొచ్చేది. అలా ఆ స్కూటీని చూసినప్పుడల్లా అవే ఆలోచనలు. అలా దాన్ని చూస్తుండగా..నా ఉద్యోగం పోయింది. ఈ స్కూటీకి కూడా పనిలేకుండా పోయింది. అనుకునేవాడు. అలా దాన్ని చూస్తుంటే తనకు ఉద్యోగం ఉన్నపుడు దానికీ నాకూ పని ఉండేదు. కానీ ఇప్పుడు అదీనేను ఖాళీగానే ఉన్నాం. అనుకుంటూండగా ఓ ఐడియా వచ్చింది.


ఇప్పుడు ఆ స్కూటీకి నాకూ కూడా పనిదొరికింది అని అనుకున్నాడు. అలా తన స్కూటీని టిఫిన్ సెంటర్ గా మార్చేశాడు. టిఫిన్ పాత్రలు అమర్చేందుకు అనువుగా రూ. 20వేలు ఖర్చుపెట్టి స్కూటీకి ప్రత్యేకంగా తయారు చేయించాడు. కూరగాయల మార్కెట్ దగ్గర టిఫిన్లు అమ్మటం ప్రారంభించాడు. తరువాత లంచ్ టైమ్ కు భోజనాలు అమ్ముతున్నాడు. టిఫిన్ రూ.20 లంచ్ రూ.40 నుంచి 50కు అమ్ముతున్నాడు.


మెల్లమెల్లగా జనాలు వస్తున్నారు. టేస్ట్ బాగుండటంతో వ్యాపారం పెరిగింది. దీంతో తన బాధల నుంచి బల్వీర్ సింగ్ బైటపడుతున్నాడు. దీంతో కష్టమర్ల డిమాండ్ కు తగినట్లుగా వ్యాపారాన్ని పెంచాడు అదే స్కూటీమీద.ఇక నాకు ఉద్యోగం అవసరం లేదు..ఇదే వ్యాపారంతో నా కుటుంబం హాయిగా బతుకుతోంది అని అన్నాడు. ఉద్యోగం పోయినప్పుడు ఎలా బతకాలని మధనపడ్డాను. కానీ ఇక కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన పనికూడా లేదు. ఇదే నా టిఫిన్ల వ్యాపారమే కొనసాగిస్తానని ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు బల్వీర్ సింగ్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *