APP Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

APP Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

App Recruitment 2021

APP Recruitment 2021 : తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 151 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. www.tslprb.inలో నోటిఫికేషన్‌ వివరాలు తెలుసుకోవచ్చని పోలీస్‌ నియామక మండలి వివరించింది.

జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 34ఏళ్లు మించకుండా ఉండాలి. న్యాయ విద్యలో డిగ్రీ పట్టా పొందిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750, ఇతరులు రూ.1500 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. సిలబస్, నోటిఫికేషన్ కు సంబంధించిన ఇతర వివరాలకు www.tslprb.inను చూడండి.

పోస్టులు, అర్హత, ఫీజు, ఎంపిక ప్రక్రియ వివరాలు..

మొత్తం పోస్టులు: 151

మల్టీ జోన్-1లో 68 పోస్టులు. (జనరల్‌ 27, బీసీ-ఏ 5, బీసీ-బీ 5, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 2, ఎస్సీ 10, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్‌ 7, ఇతరులు 2)

మల్టీ జోన్‌-2లో 83 పోస్టులు. (జనరల్‌ 32, బీసీ-ఏ 7, బీసీ-బీ 7, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 3, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్‌ 8, ఇతరులు 2)

అర్హత: ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ పూర్తి చేసి సంబంధిత న్యాయవాద రంగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థులు 2021, జూలై 1 నాటికి 34 ఏళ్ల లోపు వారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా

పరీక్ష విధానం: మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్‌ డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇది కూడా మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.1500

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750

మరిన్ని వివరాలకు అభ్యర్థులు www.tslprb.in ను సందర్శించాలి.