ఆఫీసర్ గ్రేడ్ A ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు – SEBI

ఆఫీసర్ గ్రేడ్ A ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు – SEBI

సెక్యూరిటీ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI)లో అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ గ్రేడ్ A ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే దరఖాస్తు గడువును మే 31, 2020 వరకు పొడింగించిన విషయం తెలిసిందే.

తాజాగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో మరోసారి దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా గడువును జూలై 31, 2020 వరకు పొడిగించింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 147 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు : –
జనరల్ స్ట్రీమ్ – 80
లీగల్ స్ట్రీమ్ – 34
ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్ – 22
సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ – 1
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ – 4
రిసెర్చ్ స్ట్రీమ్ – 5
ఆఫీషియల్ ల్యాంగ్వేజ్ స్ట్రీమ్  – 1

విద్యార్హత : అభ్యర్దులు బీటెక్, ఎంసీఏ, పీజీ, లా డిగ్రీ, సీఏ, సీఎస్, సీఎఫ్ఏ, సీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : అభ్యర్దుల వయసు ఫిబ్రవరి 29, 2020 నాటికి 30 ఏళ్లకు మించరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, EWS అభ్యర్దులు రూ.1000 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు రూ.100 చెల్లించాలి.
ఎంపికః విధానం : అభ్యర్దులను ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు : దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 7, 2020.
దరఖాస్తు చివరి తేదీ : జూలై 31, 2020.

Read: UCILలో 140 గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలు