లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బైడెన్ తొలి రోజు సంతకాలు: అమెరికాకు ముస్లింలు రాకూడదనే ట్రంప్ నిర్ణయానికి చెక్

Published

on

Muslim Travel Ban: డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇమిగ్రేషన్ లిమిటేషన్ నిర్ణయానికి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చెక్ పెట్టారు. బుధవారం ముస్లిం ట్రావెల్ బ్యాన్ ను ముగించాలని అధికారికంగా పర్మిషన్ ఇచ్చేశారు. గతంలో ముస్లిం, ఆఫ్రికా దేశాల నుంచి అమెరికాకు వచ్చే ముస్లింలకు నిషేదం విధించారు.

ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల తర్వాత జో బైడెన్ 17ప్రత్యేకమైన ఆర్డర్స్ మెమొరాండంపై సంతకం పెట్టారు. వాటిల్లో ఇదొకటి.

వీసా ప్రోసెసింగ్ మొదలుపెట్టాలి:
అధికారులకు వీసా ప్రోసెసింగ్ రీ స్టార్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు. నిషేదిత దేశాలు రావడానికి అనుమతులు ఇవ్వడం వల్ల ఎఫెక్ట్ అయిన దేశాలు అభివృద్ధి చెందడానికి హెల్ప్ అవుతుందని అన్నారు.

2017లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి ముస్లింలకు నిషేదం విధించారు. ఇరాన్, ఇరాక్, లిబ్యా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమన్ దేశాలు అందులో ఉన్నాయి. పలు లీగల్ ఛాలెంజెస్ ను ఎదుర్కొన్నా సుప్రీం కోర్టు కూడా 2018లో నిషేదానికి ఆమోదం తెలిపింది.

ముస్లిం ట్రావెల్ నిషేదం
మొత్తం మీద 12దేశాల నుంచి ముస్లిం ట్రావెల్ ను నిషేదించింది అమెరికా. ఇరాన్, లిబ్యా, సిరియా, యెమన్, సోమాలియా, నైజీరియా, మయన్మార్, ఎరిట్రియా, కైర్జిస్తాన్, సూడాన్, టాంజానియా, నార్త్ కొరియా, వెనిజులాల నుంచి ఎవరూ రాకూడదని కఠిన ఆంక్షలు విధించింది.

అమెరికాలో తమ సంతానం పుట్టాలని ప్రతి ఒక్కరూ కలగా భావించే నిర్ణయానికి నో చెప్పిన ట్రంప్ నిర్ణయానికి కూడా బైడెన్ చెక్ పెట్టారు. మెక్సికోకు అమెరికాకు కడుతున్న అడ్డుగోడ నిర్మాణాన్ని కూడా ఆపేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్డర్ కారణంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వృథాగా ఖర్చుపెడుతున్న బిలియన్ డాలర్ల సొమ్ము మిగిలినట్లే.