లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బైడెన్ స్పీచ్ రైటర్ వినయ్ రెడ్డిపై ప్రశంసల వర్షం

Published

on

Joe Biden’s Speech Writer Vinay Reddy బుధవారం రాత్రి 10 గంటల సమయంలో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బైడెన్ తన టీమ్ లో భారతీయ-అమెరికన్​లకు పెద్దపీట వేసిన విషయం కూడా అందిరీకీ తెలిసిందే. అయితే జో బైడెన్​ ప్రభుత్వంలో వైట్ హౌస్ స్పీచ్​ రైటింగ్​ విభాగం అధ్యక్షుడిగా నియామకమైన భారతీయ-అమెరికన్​ వినయ్ ​రెడ్డి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది.

బైడెన్​ ప్రమాణస్వీకారం సందర్భంగా చేసిన ప్రసంగాన్ని రాసిన వినయ్​..అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. బైడెన్​ తన పాలనలో సాధించబోయే లక్ష్యాలు, అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఐకమత్యం, ప్రజాస్వామ్యం ప్రాముఖ్యత వంటి అంశాల గురించి శక్తిమంతమైన పదాలతో.. పదునైన వాక్యాలతో చక్కటి ప్రసంగాన్ని బైడెన్​కు అందించారు వినయ్​.

బైడెన్​ స్పీచ్​లోని కొన్ని ఆణిముత్యాలు

ఈ రోజు చారిత్రకమైంది. అమెరికన్ల రోజు. ప్రజాస్వామ్యానిది. ఈ రోజు జరుపుకుంటున్న విజయోత్సవం ఏ ఒక్కరిదీ కాదు అందరిది. ప్రజాస్వామ్యం విలువైంది, సున్నితమైంది. ఐకమత్యం లేకపోతే శాంతి లేదు. అక్కడ కోపతాపాలే మిగులుతాయి. అభివృద్ధి ఉండదు. జాతి ఉండదు.. ఘర్షణలే జరుగుతాయి. దేశం చారిత్రక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఐకమత్యంతోనే ముందుకు వెళ్లగలం. కొన్ని రోజుల క్రితం జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత ఇక్కడ శాంతియుతంగా సమావేశమవుతున్నాం. భయాందోళన నుంచి దూరంగా వెళ్లడం, హింసాత్మక ఘటనలు ఎప్పటికీ జరగకుండా ఉండడం ప్రజాస్వామ్యంతోనే సాధ్యం. బైడెన్ ఒకనొక సమయంలో ‘అధ్యక్షుడు ప్రజలందరి కోసం అంటూ వ్యాఖ్యానించారు. ఇలా బైడెన్ నోట జారువాలిన ప్రతి మాట తూటలా పేలింది. అందరినీ ఆకర్షించింది. ఆ మాటలన్ని వినయ్​ హృదయాంతరాల్లోంచి బయటకు వచ్చి ఆయన కలం ద్వారా అక్షరరూపం దాల్చాయి.

కరీంనగర్ వాసి

వినయ్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామం. వినయ్ తండ్రి నారాయణరెడ్డి కుమారుడు వినయ్ రెడ్డినయ్ రెడ్డి. తండ్రి నారాయణ రెడ్డి 1970లో అమెరికాకి వెళ్ళారు. అక్కడే పుట్టిన వినయ్ రెడ్డి… అమెరికాలో న్యాయవాద డిగ్రీ పూర్తి చేశారు. ఆయనకు కంటెంట్ రైటర్ గా మంచి పేరుంది. మొదట్లో యూఎస్ ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ సంస్థ తరపున స్పీచ్ రైటర్ గా పని చేశారు.

2012 అమెరికా ఎన్నికల సమయంలో వినయ్ రెడ్డి టాలెంట్ తెలుసుకున్న బరాక్ ఒబామా… తన స్పీచ్ రైటర్ గా నియమించుకున్నారు. ఇప్పుడు ఏకంగా జో బైడెన్… అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ కి స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ గా వినయరెడ్డిని నియమించారు. మొన్నటి అమెరికా ఎన్నికల్లోనూ బైడన్, కమలా హరిస్ కు స్పీచ్ రైటర్ గా, ట్రాన్స్ లేటర్ గా వినయ్ రెడ్డి పని చేశారు. పోతిరెడ్డిపేటలో ఆస్తులను వీరి కుటుంబం అమ్ముకోలేదు. ఇప్పటికీ గ్రామంలో మూడెకరాల వ్యవసాయ భూమి, ఇల్లు వినయ్ రెడ్డి తండ్రి నారాయణ్ రెడ్డి పేరుతోనే ఉన్నాయి. గ్రామ అభివృద్ధికి ఇప్పటికీ సాయం చేస్తున్నారని పోతిరెడ్డిపేట గ్రామస్థులు చెబుతున్నారు..