లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

భారత్‌తో తొలి రెండు టెస్టులకి ఇంగ్లాండ్ టీమ్

Published

on

England squad : భారత పర్యటనకు సంబంధించి ఆటగాళ్ల జాబితాను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌, ఏస్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌లు తిరిగి జట్టులో చేరారు. శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌కి ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లకు ఇంగ్లాండ్‌ విశ్రాంతి ఇచ్చింది. వీరిద్దరితో పాటు శ్రీలంక టూర్‌కి దూరంగా ఉన్న జానీ బెయిర్‌స్టో, రోరీ బర్స్స్‌ కూడా ఇంగ్లాండు జట్టుతో చేరారు.

ఇంగ్లాండ్‌ టెస్ట్‌ జట్టుకి జో రూట్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా జోఫ్రా ఆర్చర్‌, మోయిన అలీ, జేమ్స్‌ అండర్‌సన్‌, డామ్‌బెస్‌, స్టువార్ట్‌ బ్రాడ్‌, రోరీ బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, జాక్‌ క్రాలే, బెన్‌ ఫోక్స్‌, డాన్‌ లారెన్స్‌, జాక్‌ లీచ్‌, డామ్‌ సిబ్లే, బెన్‌ స్టోక్స్‌, ఓల్లీ స్టోన్‌, క్రిస్‌ వోక్స్‌ ఉన్నారు.

భారత పర్యటనకు వచ్చే ఇంగ్లాండ్‌ ఇండియాతో నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌లలో తలపడనుంది. కరోనా నిబంధనలు కారణంగా ఈసారి మ్యాచ్‌లను పరిమిత వేదికల్లో నిర్వహిస్తున్నారు. ఇంగ్లాండ్‌, భారత్‌ల మధ్య మ్యాచ్‌లు చెన్నై, పూనే, అహ్మదాబాద్ లలో జరుగుతాయి. ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించి మొదటి రెండు టెస్టులకు భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.

భారత టీం : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్