లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో : అజ్ఞాతంలోకి జోగు రామన్న!

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మంత్రి జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఉదయం నుంచి మంత్రి జోగు రామన్న ఫోన్ స్విచ్చాఫ్ అయింది.

Published

on

Jogu Ramanna into hiding

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మంత్రి జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఉదయం నుంచి మంత్రి జోగు రామన్న ఫోన్ స్విచ్చాఫ్ అయింది.

రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మంత్రి జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. సోమవారం (సెప్టెంబర్ 9, 2019) ఉదయం నుంచి మంత్రి జోగు రామన్న ఫోన్ స్విచ్చాఫ్ అయింది. తన గన్ మెన్లను వదిలిపెట్టి ఒంటరిగా వెళ్లిపోయారు. అయితే మంత్రివర్గంలో చోటుదక్కని తన అనుచరులకు ముందుగానే సమచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ఆయన అందుబాటులో లేరు. 

దీంతో ఆయన ఎక్కడికి వెళ్లారని కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాల్లోనూ టెన్షన్ చోటు చేసుకుంది. మంత్రి జోగురామన్న సైతం మంత్రివర్గ విస్తరణపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన అలకబూనినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్‌లో చిచ్చు పెట్టినట్లే కనబడుతోంది. మాజీ హోంమంత్రి నాయినీ నరసింహ్మారెడ్డి ఇప్పటికే అసంతృప్త గళం వినిపించారు. తనకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాట తప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మాజీ మంత్రులు నాయినీ నరసింహా రెడ్డి, లక్ష్మారెడ్డి, జోగు రామన్న, మాజీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌ పద్మా దేవేందర్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌‌‌‌, రెడ్యానాయక్‌‌‌‌, ఆరూరి రమేశ్‌‌‌‌‌తో పాటు పలువురు నేతలు మంత్రి పదవులు ఆశించారు. వీరిలో కనీసం ఇద్దరికి మంత్రి పదవులు ఖచ్చితంగా వస్తాయని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఈ క్రమంలోనే కొందరు గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది.
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *