రామ్ ఫస్ట్ యాడ్.. హిందీ ఇరగదీశాడుగా!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

John Abraham – Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తొలిసారిగా ఓ యాడ్ లో నటించాడు.. అదికూడా బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం తో కలిసి కనిపించడం విశేషం.. వీరిద్దరూ కలిసి నటించిన New Garnier Men Shampoo Color ప్రకటన వీడియో సోమవారం సాయంత్రం విడుదల చేశారు. రామ్ న్యూ లుక్ లో ఆకట్టుకున్నాడు. అలాగే అతని హిందీ మాడ్యులేషన్ కూడా బాగుంది.

ఫస్ట్ టైం యాడ్ లో నటించడం, అదికూడా జాన్ అబ్రహాంతో నటించడం.. అలాగే షూటింగ్ అండ్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు చాలా ఫన్ అనిపించేదని, ఈ అనుబంధం ఇలా కొనసాగాలని రామ్ ట్వీట్ చేశాడు.

సినిమాల విషయానికొస్తే రామ్ నటించిన ‘రెడ్’ షూటింగ్ పూర్తయింది కానీ లాక్‌డౌన్ విడుదల వాయిదా పడింది. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల తర్వాత దర్శకుడు కిషోర్ తిరుమలతో మూడోసారి కలిసి రామ్ చేసిన చిత్రం ఇది.

Related Tags :

Related Posts :