లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

క్లినికల్ ట్రయల్స్‌లో పార్టిసిపెంట్‌కు అంతుచిక్కని వ్యాధి.. జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగానికి బ్రేక్

Published

on

covid-19-vaccine-tracker-sept-24-johnson-johnson-candidate-enters-phase-3-trials

Covid-19 vaccine స్టడీలో భాగంగా Johnson & Johnson వెనుకడుగేసింది. ఈ స్టడీలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తికి పసిగట్టలేని జబ్బు రావడంతో స్టడీని మధ్యలోనే ఆపేశారు. ఈ స్టడీలో 60వేల మంది పేషెంట్లకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ .. పేషేంట్ల సేఫ్టీలో భాగంగా ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగానే క్లినికల్ ట్రయల్ ను మధ్యలోనే ఆపేశారు. STATకు డాక్యుమెంట్ ను సబ్‌మిట్ చేశారు. STAT, J&Jలను కాంటాక్ట్ చేసి ఇది పార్టిసిపెంట్ కు వర్ణించలేని.. గుర్తుపట్టలేని జబ్బు రావడంతో ఆపేయాల్సి వస్తుందంటూ పేర్కొంది. మరిన్ని వివరాలు బయటపెట్టేందుకు కంపెనీ నిరాకరించింది.పార్టిసిపెంట్ ప్రైవసీని మేం గౌరవిస్తాం. ఇంకా అతని అనారోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ఇన్ఫర్మేషన్ ను షేర్ చేయగలం’ అని కంపెనీ ఓ స్టేట్‌మెంట్ లో వెల్లడించింది.

J&J కొన్ని ప్రతికూల ఈవెంట్లు జరిగినప్పుడే వాయిదా వేయాలనుకుంటుంది. అనారోగ్యం, యాక్సిడెంట్లు, ఇతర మెడికల్ దుష్పరిణామాలు, వంటివి క్లినికల్ స్టడీలో జరిగినప్పుడు మధ్యలో ఆపేయాల్సి ఉంటుంది. లేదా దానిని కొనసాగించడం సరికాదు. ప్రస్తుతం వ్యాక్సిన్ స్టడీ క్లినికల్ హోల్డ్ లో ఉంది. J&J సాధారణంగా ఈ విషయాన్ని పబ్లిక్ తో పంచుకుంటుంది. కానీ, స్టడీ మధ్యలో ఆగిపోతే మాత్రం కాదు.

డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ లేదా DSMB సోమవారం కేసును రివ్యూ చేయనుంది. ‘ఇది వెంటనే జరుగుతుందని చెప్పలేం’ అని J&J చెప్తుంది. క్లినికల్ ట్రయల్స్ ఆగిపోవడం అనేది సాధారణ విషయం కాదు. కొన్ని కేసుల్లో.. SARS-CoV2 వ్యాక్సిన్లు టెస్టు చేసే క్రమంలోనూ జరగొచ్చు.

జాన్సన్ & జాన్సన్ ట్రయల్ లో భాగంగా ఇది సర్‌ప్రైజింగ్ విషయమేం కాదు. దీనికి దగ్గరగా మరొకటి మొదలుపెడతాం. సమస్య రాకుండా స్టడీ పూర్తిచేస్తాం. ‘మేం 60వేల మందిపై స్టడీ నిర్వహిస్తున్నాం. ఇది చాలా చిన్న గ్రామం. ఈ గ్రామంలో చాలా మెడికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి’ అని J&J చెప్పింది.

ఫేజ్ 3 స్టడీలో భాగంగా (J&J) జాన్సన్ అండ్ జాన్సన్ వాలంటీర్లను సెప్టెంబర్ 23న ఎన్‌రోల్ చేసుకోనుంది. యునైటెడ్ స్టేట్స్ తో పాటు ఇతర దేశాల నుంచి 60వేల మంది వరకూ పార్టిసిపెంట్స్ ను ఎన్‌రోల్ చేయనున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *