పుట్టినరోజున ప్రియుణ్ణి సర్‌ప్రైజ్ చేసిన గుత్తా జ్వాల..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాల గుత్తా, తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ గతకొద్ది కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా విష్ణు చెన్నైలో జ్వాల హైదరాబాద్‌లో లాక్ అయిపోయారు. ఒకరినొకరం మిస్ అవుతున్నామంటూ ఈ ప్రేమ పక్షులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు.

Jwala Gutta-Vishnu Vishal

అయితే నేడు(జూలై 17) విష్ణు విశాల్ బర్త్‌డే.. ఈ సందర్భంగా జ్వాల చెన్నైలోని అతని ఇంటికెళ్లి సర్‌ప్రైజ్ చేసింది. దగ్గరుండి ప్రియుడి చేత కేక్ కట్ చేయించి అతగాణ్ణి విష్ చేసింది. ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. ప్రియురాలితో కలిసి ఉన్న ఫోటో పోస్ట్ చేశాడు. తామిద్దరం త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇటీవల జ్వాల చెప్పిన సంగతి తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా విష్ణు కొత్త చిత్రం FIR నుండి అతని క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ వీడియో విడుదల చేసింది చిత్రబృందం.

Vishnu Vishal

Related Posts