లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

K.G.F: Chapter 2 – హైదరాబాద్‌లో రాకీ భాయ్..

Published

on

K.G.F: Chapter 2- యావత్ సినీ ప్రపంచం చూపు కన్నడ పరిశ్రమవైపు తిప్పిన సినిమా ‘కె.జి.యఫ్’.. రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో, హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్నభారీ బడ్జెట్‌తో సీక్వెల్ ‘కె.జి.యఫ్ -చాప్టర్ 2’ తెరకెక్కిస్తున్నారు.



శ్రీనిధి శెట్టి కథానాయిక. అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ప్రైమ్ మినిస్టర్ రమికా సేన్‌గా రవీనా టాండన్, కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ ‘కె.జి.యఫ్ 2’ షూటింగ్ ఆగస్టు నెలాఖర్లో పున:ప్రారంభమైంది.


ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగులో పాల్గొనడానికి యష్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. ఎయిర్ పోర్టులో తీసిన యష్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


పూజా హెగ్డే.. ఫుల్ ఖుష్ అవుతోంది..


కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది. 2021 ఏప్రిల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం : రవి బస్రూర్, సినిమాటోగ్రఫి : భువన్ గౌడ, ఎడిటింగ్ : శ్రీకాంత్. YASH

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *