పులివెందుల సింగం…..ప్రాణాలకు తెగించి సాహసం చేసిన ఎస్సై

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విధి నిర్వహణలో పోలీసులు ఒకో సారి ప్రాణాలకు సైతం తెగించి పోరాడాల్సి వస్తోంది. కొన్ని సంఘటనలు సినిమా టిక్ గా అనిపించినా పోలీలుసు ధైర్యంతో పోరాడుతూనే ఉంటారు. కడప జిల్లా పులివెందులలో అచ్చు సినిమా సీన్ లో జరిగినట్టే జరిగింది శుక్రవారం నాడు. అక్రమ మద్యం సరఫరా చేస్తున్న ముఠాను  పట్టుకోటానికి పులివెందుల ఎస్సై గోపీనాధ రెడ్డి ప్రాణాలకు తెగించి సాహసం చేశారు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో పట్టణంలోని రాఘవేంద్ర ధియేటర్ సమీపంలో రోడ్డు పక్కన ఆపిన కారులో అక్రమ మద్యం ఉన్నట్లు తెలిసింది. ఎస్సై గోపీనాధ్ రెడ్డి తన సిబ్బందితో అక్కడకు వెళ్లి కారును చుట్టుముట్టారు.

పోలీసులను చూసిన నిందితులు వారినుంచి తప్పించుకునేందుకు కారును ముందుకు వెనక్కి నడుపుతూ… పోలీసులపైకి దూకించ బోయారు. కారును అడ్డుకోవడంలో భాగంగా వాహనం ముందు భాగాన్ని ఎస్సై పట్టుకున్నారు.

దీంతో నిందితులు కారును వేగంగా ముందుకు నడిపారు. అయినా గోపీనాధరెడ్డి కారును వదలకుండా అలాగే గట్టిగా పట్టుకుని కారు ముందు భాగంలో ఉండిపోయారు. అయినప్పటికీ నిందితులు కారును వేగంగా నడుపుతూ సుమారు 2 కిలో మీటర్లు దూరం వెళ్ళారు. అయినా ఎస్సై కారును వదిలిపెట్టకుండా దానిమీదే ఉండి చాక చక్యంగా కారు అద్దాలు పగలకొట్టారు.

ఇంతలో వేరోక వాహనంలో వెంబడిస్తూ వచ్చిన పోలీసు సిబ్బంది కారును అడ్డుకున్నారు.. నిందితులను అదుపులోకి తీసుకుని వారివద్దనుంచి 80 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా సీసీ టీవీ లో రికార్డు అయ్యింది. నిందితులు కారును వేగంగా నడపటం…ఎస్సై కారు బానెట్ ను పట్టుకోవటం తమిళ్ సింగం సినిమాను తలపించింది.

Related Posts