కుమారి కాజల్‌‌గా చివరి రెండు రోజులు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kajal Aggarwal – Gautam Kitchlu: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమె ముంబైకి చెందిన యంగ్ బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లును ఈ నెల 30న వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కాజల్ బ్యాచిలరేట్ పార్టీకి సంబంధించిన పిక్స్ అలాగే విజయదశమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


కుమారి కాజల్ కాస్తా శ్రీమతిగా మారబోతున్న నేపథ్యంలో చందమామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘‘మిస్ కాజల్ అగర్వాల్‌గా చివరి రెండు రోజులు. నా సిస్టర్ నిషాతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాను’’ అంటూ చెల్లి నిషా అగర్వాల్, ఆమె బాబుతో కలిసిఉన్న పిక్స్ షేర్ చేసింది కాజల్. ఫ్యాన్స్, నెటిజన్స్ కాజల్‌కు విషెస్ తెలియచేస్తున్నారు.

 

View this post on Instagram

 

❤️

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Related Tags :

Related Posts :