లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం..భార్య తప్పులను తట్టుకోలేక, కూతురు హత్యను జీర్ణించుకోలేక కళ్యాణ్ ఆత్మహత్య

Published

on

ఘట్ కేసర్ లో ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆద్య తండ్రి కళ్యాణ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అనూష చేసిన తప్పులను తట్టుకోలేక, కూతురు హత్యను జీర్ణించుకోలేక తనలో తానే కుమిలిపోయాడు. బిడ్డలేని లోకంలో నేను ఉండలేనంటూ కళ్యాణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనూష చేసిన తప్పిదానికి తండ్రి బిడ్డల మరణం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

వారం రోజుల క్రితం కరుణాకర్ ఆద్యను కిరాతకంగా చంపేశాడు. అంతలోనే చిన్నారి తండ్రి సూసైడ్ స్థానికంగా అంతులేని విషాధాన్ని నింపింది. చెయ్యని నేరానికి అభశుభం తెలియని చిన్నారి ఆద్య బలైంది. అనూష తన భర్తకు తెలియకుండా ఇద్దరు యువకులతో కొనసాగించిన సంబంధం ఈ దారుణానికి కారణమైంది.

తనను దూరం పెట్టి తాను పరిచయం చేసిన మరో యువకుడితో చనువుగా ఉంటుందనే కోపంతో అనూష ప్రియుడు కరుణాకర్ ఆరేళ్ల చిన్నారిని గొంతు కోసి చంపేశాడు. బాత్ రూమ్ లో దాచిపెట్టిన ప్రియుడిని బయటికి రప్పించే క్రమంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. మేడ్చల్ జిల్లా పోచారం ఈనెల 2న ఈ ఘటన చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం సష్టాస్తున్నారు.

భువనగిరి ప్రాంతానికి చెందిన కళ్యాణ్ 2011లో అనూషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల పాప ఆద్య ఉంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయినా వీరిద్దరికి పెద్దల అంగీకరంతో లవ్ మ్యారేజ్ జరిగింది. కళ్యాణ్ భువనగిరిలో రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఘట్ కేసర్ సమీపంలోని పోచారంలో విహారి హోమ్స్ లో వీరు నివాసముంటున్నారు. అనూషకు సికింద్రాబాద్ లోని భవానీనగర్ కు చెందిన కరుణాకర్ అనే యువకుడితో కొద్ది రోజుల కిందట ఓ ఎలక్ట్రానికి షాప్ లో పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ తో మరింత దగ్గరయ్యారు. అది కాస్తా శారీరక సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత కరుణాకర్ ఆమెకు రాజశేఖర్ అనే మరో స్నేహితుడిని పరిచయం చేశాడు. రాజశేఖర్ పరిచయమయ్యాక అతనితో సాన్నిహిత్యం పెంచుకున్న అనూష…కరుణాకర్ ను దూరం పెట్టింది. విషయం తెలుసుకున్న కరుణాకర్ కోపంతో రగిలి పోయాడు.

ఈ క్రమంలో జులై 2న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అనూష ఇంటికి వెళ్లాడు. అనూష ఇంటికి వెళ్లే సమయంలో ఓ మెడికల్ షాప్ లో కరుణాకర్ రెండు సర్జికల్ బ్లేడులు కొన్నాడు. కరుణాకర్ వెళ్లే సరికి అనూష తన ఇంట్లో రాజశేఖర్ తో సాన్నిహిత్యంగా ఉంది. గమనించిన కరుణాకర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

కరుణాకర్ రాకను గమనించిన అనూష రాజశేఖర్ ను బాత్ రూమ్ లో దాచింది. దీంతో గదిలో నుంచి బయటికి రావాలని కరుణాకర్ ఒత్తిడి చేశాడు. బయటకు రాకపోతే చిన్నారి ఆద్యను చంపుతానని బెదిరించాడు. అయినప్పటికీ అతను బయటికి రాకపోవడంతో కరుణాకర్ అన్నంత పని చేశాడు. సర్జికల్ బ్లేడ్ తో చిన్నారి గొంతు కోశాడు.

కరుణాకర్ చిన్నారిపై దాడి చేస్తుండగా అనూష అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆమెపైనా కరుణాకర్ దాడి చేశాడు. ఇద్దరి అరుపులతో రాజశేఖర్ బయటికి వచ్చాడు. దీంతో కరుణాకర్ అతని మెడపై కత్తితో దాడి చేసి పరుగులు తీశాడు. అనంతరం తాను కూడా అదే కత్తితో మెడ కోసుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి కాలనీ వాసులంతా షాక్ కు గురయ్యారు.

గాయపడ్డ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గంమధ్యలోనే తీవ్ర స్రావం కావడంతో ఆద్య మరణించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన రాజశేఖర్ ను ఆస్పత్రికి తరలించారు. కరుణాకర్, రాజశేఖర్, అనూషలకు గతంలోనే పరిచయం ఉందని పోలీసులు తేల్చారు. రెండు రోజుల తర్వాత కరుణాకర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

అయితే ఇవాళ ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని బిడ్డను పొట్టన పెట్టుకున్నారని గత కొద్ది రోజులుగా కళ్యాణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నమ్మకంగా ఉన్న భార్య ఇంత పని చేస్తుందని ఊహించలేకపోయాడు. ఒకటి తర్వాత మరో తప్పిదం బయటకు రావడంతో జీర్ణించుకోలేకపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ కళ్ల ముందు లేకపోవడంతో తట్టుకోలేకపోయాడు. బిడ్డ లేని లోకంలో ఉండలేనంటూ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్యాణ్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కళ్యాణ్ భువనిగిరిలో పంచాయత్ సెక్రటరీ గా పని చేస్తున్నారు. భార్యాబిడ్డతో హ్యాపిగా ఉండేవాడు. చీకుచింత లేని కుటుంబంలో కరుణాకర్, రాజశేఖర్ ఎంట్రీతో కల్లోలం మొదలైంది. భర్తను పక్కన పెట్టి అనూష ఇద్దరితో వేర్వేరుగా సంబంధం కొనసాగించింది. అదే ఇప్పుడు తండ్రి, బిడ్డను బలి తీసుకుంది.

వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా విషాదంగా ముగుస్తాయనేందుకు ఇదో మంచి ఉదాహరణ. అనూష చేసిన నిర్వాకంపై కళ్యాణ్ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇద్దరిని పెట్టుకున్న ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *