లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

కళ్యాణ లక్ష్మీ పథకానికి తూట్లు, సంతకాలు ఫోర్జరీ చేసి లక్షలు కొట్టేస్తున్నారు

Published

on

kalyana lakshmi scheme fraud: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మీ పథకం పక్కదారి పడుతోంది. పేదింటి ఆడబిడ్డల కుటుంబానికి ఆసరా అందించడానికి తలపెట్టిన పథకానికి ..నకిలీరాయుళ్లు తూట్లు పొడుస్తున్నారు. ఆడబిడ్డ పెళ్లికి సహకరించాలనే తలంపుతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కల్యాణ లక్ష్మి పథకాన్ని.. కొందరు తమకు వరంగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకంలో అవినీతి జరగకూడదని మూడంచెల విధానాన్ని అవలంభిస్తున్నా…అధికారుల కళ్లు గప్పి వారి సంతకాలనే ఫోర్జరీ చేసి లక్షల్లో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు కన్నింగ్‌ రాయుళ్లు.


రంగంలోకి దిగిన పోలీసులు:
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో ఫోర్జరీ ముఠా విషయం వెలుగులోకి రావడంతో.. అధికారులు కంగుతిన్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు, నేతలు.. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఫోర్జరీ సంతకాలతో కళ్యాణ లక్ష్మీ పథకానికి తూట్లు పొడుస్తున్న నకిలీ ముఠా అంతు చూడటానికి పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు ఈ విషయం వెలుగులోకి రావడంతో.. లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావలసిన డబ్బులు కూడా ఆ రాబంధుల చేతుల్లోకి వెళ్లిపోయాయేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.