లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

కమల్ కాలికి సర్జరీ.. స్పందించిన శృతి హాసన్, అక్షర హాసన్..

Published

on

Kamal Haasan: యూనివర్సల్ స్టార్‌, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ఆరోగ్యం గురించి సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుమార్తెలు శృతి హాసన్‌, అక్షర హాసన్ ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు.

‘నాన్న కాలికి చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో శస్త్ర చికిత్స జరిగింది.. నాలుగైదు రోజులపాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో హాస్పిటల్‌లోనే ఉంటారు.. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారు, త్వరలో పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు.. నాన్న కోలుకోవాలని ప్రార్ధించినవారందరికీ థ్యాంక్స్’ అంటూ శృతి హాసన్, అక్షర హాసన్ లేఖలో పేర్కొన్నారు.

కాగా ఈ ఏడాది ప్రథమార్థంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మక్కల్‌ నీది మయ్యం పార్టీని స్థాపించిన కమల్‌ గత కొన్నిరోజులుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కాలు నొప్పి రావడంతో పరీక్షించిన వైద్యులు సర్జరీ చేశారు. కమల్, శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘భారతీయుడు 2’ షూటింగ్ దశలో ఉంది. తర్వాత లోకేష్ కనకరాజ్ తో ‘విక్రమ్’ అనే సినిమా చేయనున్నారు కమల్.