లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

తన బొమ్మ వేసిన పిల్లాడికి ఫోన్ చేసిన కమలా హ్యారిస్..ఉబ్బితబ్బిబైన పిల్లాడు

Published

on

Kamala Harris calls 14-year-old boy : కమలా హ్యారిస్. పరిచయం అక్కర్లేని మహిళ. భారత మూలాలున్న ఈమె అమెరికాలో ఉపాధ్యక్షురాలి స్థాయికి చేరుకున్నారు. అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన కమాలా హ్యారిస్ త్వరలో ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టబోతున్నారు. డెమొక్రాటిక్ పార్టీ నేతగా.. తనదైన శైలిలో పార్టీ విజయానికి కృషి చేసిన ఆమెకు ఉపాధ్యక్ష పదవిని ఇవ్వాలని జో బైడెన్ విజయానికి ముందే ప్రకటించారు.ఆమె ఉపాధ్యక్ష పదవి చేపట్టనున్న క్రమంలో టైలర్ గార్డన్ అనే 14 ఏళ్ల బాలుడు కమలా హ్యారిస్ చిత్రాన్ని స్వయంగా గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ చిత్రాన్ని చూసిన కమలా హ్యారిస్ హర్షం వ్యక్తం చేశారు. ఆనందపడ్డారు. తన చిత్రాన్ని వేసిన బే ఏరియాకు చెందిన బాలుడు టైలర్ గార్డన్ కు కమలా హ్యారిస్ స్వయంగా ఫోన్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.నల్లా ఓపెన్ చేసి లైటర్ వెలిగిస్తే మంటలు


‘‘హలో మైడియర్ బోయ్..ఐయామ్ కమలా హ్యారిస్ అంటూ తనతో మాట్లాడుతున్నది కమల హ్యారిస్ అని తెలుసుకున్న ఆ బాలుడు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. సంతోషంతో గెంతులేశాడు. ఫోన్ చేసిన కమలా హ్యారిస్..ఆ బాలుడిపై ప్రశంసలు కురిపించింది. అద్భుత ప్రతిభ కనబర్చావనీ…వెల్ డన్ అంటూ మెచ్చుకున్నారు. అతడి కళాత్మకతతో తన హృదయం నిండిపోయిందని చెప్పారు.అతడు తన చిత్రాన్ని వేయడమన్నది తనకు చాలా ప్రత్యేకమైన విషయమని తెలిపారు. ఈ సంభాషణను కూడా టైలర్ ట్వీట్ చేశాడు. అది కూడా వైరల్ అవుతోంది. గతంలో తాను వేసిన చిత్రాన్ని కమల హ్యారిస్‌కు చేరుకునేలా సాయం చేసిన హిల్లరీ క్లింటన్ కూతురు చెల్సీ క్లింటన్‌కు ట్విట్టర్ ద్వారా టైలర్ ధన్యవాదాలు తెలిపాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *