లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

సంపన్నుల ముక్కు పిండుతాం, న్యాయంగా పన్నులు చెల్లించాల్సిందే – కమలా

Published

on

Kamala Harris says no tax increase : అమెరికా ప్రజలకు మరోసారి ఊరటనిచ్చే వార్త చెప్పారు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. వార్షిక ఆదాయం పన్ను చెల్లింపులపై గతంలోనే హామీ ఇచ్చిన ఆమె.. తాజాగా మరోసారి మరింత స్పష్టతనిచ్చారు. వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్లలోపు ఉన్న అమెరికన్లు ఎటువంటి అదనపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అయితే సంపన్నులను మాత్రం ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తామని ఆమె తేల్చిచెప్పారు.కార్పొరేషన్లు, ధనికులు మాత్రం జో బైడెన్ ప్రభుత్వంలో న్యాయంగా తమ పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఘన విజయం సాధించగా.. అమెరికా చరిత్రలో నిలిచిపోయేలా కమలా హ్యారిస్‌ రికార్డులు సృష్టించారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రజలపై పన్ను భారం పడుతుందని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో.. వాటిపై డెమొక్రాటిక్‌ నేతలు స్పష్టతనిస్తూ వస్తున్నారు.బైడెన్‌ అధికారంలో ఎవరికీ ఇబ్బందులు ఉండవంటూ ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి కమలా హ్యారిస్ దీనిపై ట్విటర్ ద్వారా స్పష్టత ఇచ్చారు. జో బైడెన్, కమలా హ్యారిస్ వచ్చే ఏడాది జనవరి 20న అధికారికంగా బాధ్యతలను చేపట్టనున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *