ఇండియాలో తెలుగు ఇండస్ట్రీయే టాప్.. కంగన సెన్సేషనల్ కామెంట్స్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kangana Ranaut about Tollywood: ఇండియాలో హిందీ సినీ పరిశ్రమే టాప్ అని జనాలు అనుకుంటుంటారని… అది తప్పు అని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అగ్ర స్థానానికి ఎదిగిందని చెప్పారు.


‘‘అనేక భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో హిందీ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.. సినీ రంగంలో ఎన్నో సంస్కరణలు రావాల్సి ఉంది.


అన్ని భాషల ఇండస్ట్రీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా తయారు చేయాలి. అనేక కారణాల వల్ల భారతీయ సినీ పరిశ్రమ విడిపోయింది. మన సినీ పరిశ్రమలో ఐక్యత లేకపోవడం హాలీవుడ్ సినిమాలకు లాభిస్తోంది. మనది ఒకే ఇండస్ట్రీ అయినా అనేక ఫిలిం సిటీలు ఉన్నాయి.


ఎన్నో గొప్ప ప్రాంతీయ సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడం లేదు… కానీ, డబ్ అయిన హాలీవుడ్ సినిమాలు మాత్రం ప్రాధాన్యతను పొందుతున్నాయి. థియేటర్లపై కొందరి గుత్తాధిపత్యం, హాలీవుడ్ సినిమాలకు మీడియా ఇస్తున్న ప్రాధాన్యత దీనికి కారణమని’’ విమర్శించారు.


ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన నేపథ్యంలో కంగన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో నటించింది కంగనా రనౌత్..

Related Posts