పెద్ద హీరోయిన్లు అయినా, వాళ్లను సంతోషపెట్టాల్సిందే, కాస్టింగ్ కౌచ్‌‌పై కంగన షాకింగ్ కామెంట్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kangana Ranaut Shocking Comments: నటి పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ల వ్యవహారంలోకి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎంటర్ అయింది. ఈ సందర్భంగా ఆమె హిందీ చిత్రసీమలోని కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి సంచలన ఆరోపణలు చేసింది.


సక్సెస్ వచ్చి టాప్ హీరోయిన్ అయినా సరే ఒక సినిమాలో అవకాశం కావాలంటే ఆ సినిమాకు పనిచేస్తున్న కీలక వ్యక్తులను సంతోష పెట్టాల్సిందేనంటు షాకింగ్ కామెంట్స్ చేసింది కంగన.


‘‘ఏ ఒక్కరినో ఉద్దేశించి నేను ఈ మాటలు చెప్పడం లేదు. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో చెబుతున్నాను. సూపర్ స్టార్స్ ఎవరైనా సరే సెట్‌లో హీరోయిన్ తమతో ఓ భార్యలా ప్రవర్తించాలని ఆశిస్తారు. సినిమాలు మారతాయి, హీరోలు మారతారు కానీ పరిస్థితి మాత్రం ఇలాగే ఉంటుంది..


అనురాగ్ కశ్యప్ ఏకపత్నీవ్రతుడేం కాదు..
పాయల్‌ ఘోష్‌ ఎలాంటి పరిస్థితినైతే ఎదుర్కొందో అలాంటి పరిస్థితిని అగ్రహీరోలతో నేను ఎదుర్కొన్నాను. వారి వాన్‌, రూమ్‌ డోర్‌ లాక్‌ అయినప్పుడో, పార్టీలోనో, ఫ్రెండ్లీగా డ్యాన్స్‌ చేసే సమయంలోనో వారి జనేంద్రియాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. మన నోట్లో వారి నాలుకను అతికించడానికి ప్రయత్నిస్తారు. పనుందంటూ మన అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఇంటికొస్తారు. మనల్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు.


నాకు తెలిసినంత వరకు అనురాగ్‌ కశ్యప్‌ ఏకపత్నీ వ్రతుడిగాఉండలేదు. తను చాలా పెళ్లిళ్లు చేసుకున్నాడు. పాయల్‌తో అనురాగ్‌ ఎలా ప్రవర్తించాడో అది బాలీవుడ్‌లో సాధారణంగా జరిగే విషయమే. ఇండస్ట్రీలోని అవుట్‌ సైడర్స్‌ అయిన అమ్మాయిలను సెక్స్‌ వర్కర్స్‌గా భావించి ఇబ్బందులకు గురి చేస్తుంటారు’’ అని ట్వీట్ చేసింది కంగనా రనౌత్‌.

 

Related Posts