ఏమి జరుగుతోంది ? గవర్నర్ ను కలిసిన కంగనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kangana Ranaut vs Shiv Sena : కంగనా రనౌత్..ఎక్కడా చూసిన ఈమెపై చర్చలు జరుగుతున్నాయి. శివసేన, ఈమె మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేటట్లుగా తయారైంది. పరిస్థితి. ఈ క్రమంలో ఈమె..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలువడం రాజకీయాలు మరింత హాట్ గా తయారయ్యాయి.

తాను చేసిన కామెంట్స అనంతరం జరిగిన పరిణామాలు, శివసేన నేతలు చేస్తున్న విమర్శలు, ప్రభుత్వ వ్యవహార శైలిపై కంగనా..గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని గవర్నర్ కార్యలయాన్ని కోరిన సంగతి తెలిసిందే.

దీంతో 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు అపాయింట్ మెంట్ కేటాయించింది. దీంతో అదే సమయానికి కంగనా గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. శివసేన నేతలు అడ్డుకుంటారనే ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అసలు వివాదం ఏంటీ ?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యలో కంగనా పలు వ్యాఖ్యలు చేసింది. ముంబై పోలీసులు సరిగ్గా వ్యవహరించడం లేదని ఆరోపణలు గుప్పించింది. శివసేనపై, ముంబై మహా నగరంపై కంగనా చేస్తున్న కామెంట్స్‌ ఆ పార్టీకి కోపం తెప్పిస్తున్నాయి. సుశాంత్‌సింగ్‌ కేసులో ముంబై పోలీసుల వ్యవహారశైలిని ఆక్షేపిస్తూ ఆ నగరాన్ని కంగనా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చారు. ఇక్కడ బతకాలంటే భయంగా వుందని వ్యాఖ్యానించారు.

శివసేన ఆమెపై నోరు పారేసుకుంది. తన ప్రాణాలకు ముప్పువుందంటూ ఆమె కేంద్రానికి విన్నవించుకుని, వై ప్లస్‌ సెక్యూరిటీ కూడా సాధించుకున్నారు.
కంగనా బంగ్లాలో కొన్ని అక్రమ నిర్మాణాలున్నాయని బీఎంసీ సోమవారం ఆమెకు నోటీసులు జారీ చేసింది. అది అవాస్తవమని ట్విటర్‌లో కంగనా జవాబిచ్చారు.

ఆమె సిబ్బంది కూడా బీఎంసీకి లిఖితపూర్వక సమాధానం పంపారు. అది అందుకున్న వెంటనే బీఎంసీ కూల్చివేత మొదలుపెట్టింది. మధ్యాహ్నానికి స్టే రావడంతో కూల్చివేత తాత్కాలికంగా నిలిచిపోయింది. ముంబై హైకోర్టు… బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వివరణ ఇవ్వాలని కోరింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఘాటుగా స్పందించారు. మూవీ మాఫియాతో జట్టుకట్టి తనపై పగ తీర్చుకుంటున్నారని ఆరోపించారు. నా ఇంటిని కూల్చిశారు. రేపు మీ అహంకారం అలానే కూలిపోతుందని అన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, అది నిత్యం పరిగెడుతూనే ఉంటుందనేది గుర్తుంచుకోండని ఉద్ధవ్‌ ఠాక్రేను ఆమె హెచ్చరించారు.

అంతేకాదు అయోధ్యపైనే కాదు, కశ్మీరీ పండిట్లపైనా సినిమా తీస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె ముంబైలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ముంబైని వదిలి హిమాచల్ ప్రదేశ్ కు వెళుతున్నట్లు సమాచారం. గవర్నర్ భేటీ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

READ  దేశంలో మొదటి సారి : రైలు ఆలస్యానికి పరిహారం

Related Posts