అలాంటి వారు ప్రమాదకరం కాదు.. ప్రాణాంతకం.. వైరల్ అవుతున్న కంగన పోస్ట్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kangana Ranaut post gone Viral: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. మహారాష్ట్ర సర్కార్‌పై తన పోరాటం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఆమె మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీని రాజ్‌భవన్‌లో కలిసి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం తనపట్ల అమానుషంగా వ్యవహరించిన తీరును వివరించారు. ముంబైలో తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూలదోయడంతో పాటు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తనపై చేసిన వ్యాఖ్యల గురించి ఈ భేటీలో గవర్నర్‌ దృష్టికి ఆమె తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.


కంగనా రనౌత్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
‘‘ఒక మహిళ యొక్క కరుణ, సౌమ్యత అనేవి తరచుగా ఆమె బలహీనతగా మారతాయి. నువ్వు లేకపోతే నేను లేను అనుకునే స్థితిలోకి ఒకరిని నెట్టవద్దు, మీరు వారికి చాలా మందికి తెలియని స్వేచ్ఛను మాత్రమే ఇస్తారు, అలాంటి వ్యక్తులు ప్రమాదకరంగా మారరు, కానీ ప్రాణాంతకం’’.. అంటూ రెడ్ గౌనుతో ఉన్న ఫొటో షేర్ చేశారు కంగనా రనౌత్.

Related Posts