డ్రగ్ రాకెట్: రాగిణి అరెస్ట్ అయింది.. సంజనా పరారైంది..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sandalwood Drug Racket-Ragini Dwivedi Arrested : క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో కలకలం డ్ర‌గ్స్ రేపుతోంది. సినీ ఇండస్ట్రీలో మాదకద్రవ్యాల వ్య‌వ‌హారంపై సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులకు సమాచారమందడంతో న‌టి రాగిణి ద్వివేదికి స‌మ‌న్లు జారీ చేశారు. నేడు (సెప్టెంబర్ 4) నటి రాగిణిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


కోర్టు నుండి సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు ఈ రోజు ఉద‌యం రాగిణీ నివాసానికి చేరుకుని త‌నిఖీలు చేసారు. అలాగే నటి రాగిణి ద్వివేది ఉపయోగిస్తున్న నాలుగు మొబైల్ ఫోన్లను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు మొబైల్స్ లోని కాల్ డేటాను సీసీబీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిసింది.


కాగా ఈ కేసులో రాగిణి స్నేహితుడు ర‌విని పోలీసులు ఇదివ‌ర‌కే అరెస్ట్ చేశారు. ద‌ర్యాప్తులో మరోన‌టి సంజనా గల్రానీ పేరు కూడా ఉండడం.. ఆమె ఫోన్ కూడా ఆఫ్‌లో ఉండడంతో పరారీలో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఇంద్ర‌జిత్ లంకేశ్‌ విచారణ నిమిత్తం గురువారం సీసీబీ అధికారుల ఎదుట హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లువురి ప్ర‌ముఖుల పేర్లు చెప్పిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.


మూడు రోజుల క్రితం లంకేశ్‌ను విచారించిన సంద‌ర్భంలో స‌రైన వివ‌రాలు అందించ‌లేద‌ని విచార‌ణ బృందం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. దీంతో మ‌రోసారి మ‌రిన్ని ఆధారాల‌తో ఆయ‌న విచార‌ణ‌కు వెళ్లార‌నే స‌మాచారంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గుబులు రేపుతోంది.


రాగిణితో పాటు మ‌రో న‌టి సంజ‌నా కూడా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. అయితే డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంతో త‌న‌కు సంబంధం లేద‌ని ఆమె చెబుతున్నారు. కాగా ఆమె త‌న మొబైల్ స్విచ్ఛాప్ చేయ‌డంతో సంజ‌నాపై అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే త‌న మిత్రుడు రాహుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విష‌యాన్ని తెలుసుకుని, త‌న సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేయ‌డంతో ఆమె ప్ర‌మేయంపై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది.


రాహుల్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌లో వీడియోలు, ఫొటోలు చూసిన సీసీబీ అధికారులు మరికొంద‌రిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో సంజ‌నా అందుబాటులోకి రాలేద‌నే ప్ర‌చారంపై…ఆమె తీవ్రంగా స్పందించ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారి తీస్తోంది.


తానేమీ ఉగ్రవాదిని కానని, సినీరంగంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నానని.. తనకు మిత్రులు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఆమె మూడో కంటికి క‌నిపించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేపథ్యంలో తానే తప్పూ చేయకపోతే, డ్రగ్ రాకెట్‌తో సంబంధం లేకపోతే ధైర్యంగా విచారణకు హాజరు కావొచ్చుగా అంటూ పలువురు కన్నడ సినీ పరిశ్రమ వర్గాల వారు కామెంట్ చేస్తున్నారు.

Related Tags :

Related Posts :