లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ప్రేమికుడికి ఎయిడ్స్ అని తెలిసి కూడా పెళ్లి చేసుకున్న బాలిక..యువకుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Published

on

Kanyakumari Minor Marriage Lover How Having AIDS : ఎయిడ్స్. ఈ పేరు చెబితేనే హడలిపోతాం. కానీ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఓ బాలిక తన ప్రియుడికి ఎయిడ్స్ (HIV) ఉందని తెలిసి కూడా అతన్ని పెళ్లి చేసుకుంది. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను పెళ్లి చేసుకున్న నేరానికి ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు యువకుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఆ బాలికకు కూడా HIV సోకిందేమోనని పరీక్షలు చేయించటనాకి వెంటనే హాస్పిటల్ కు తరలించిన ఘటన తమిళనాడులోకి కన్యాకుమారి జిల్లాలో జరిగింది.

ఈ ప్రేమికుల వివరాల్లోకి వెళితే..కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ లోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ 17 సంవత్సరాల యువతి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమె గత రెండు రోజుల నుంచి కనిపించకుండాపోయింది. దీంతో కంగారుపడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సదరు యువతి కోసం గాలింపు చేపట్టారు.

దీంట్లో భాగంగా ఆమె 22 ఏళ్ల ఆటో డ్రైవర్ ని ప్రేమించిందని వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోవటానికి ఏర్పాటు చేసుకున్నారని తమ విచారణలో గుర్తించారు. వారిద్దరూ కోవైలోని స్నేహితుల వద్దకు వెళ్లారని..అక్కడే ఫ్రెండ్స్ సహకారంతో పెళ్లి చేసుకున్నారని తెలుసుకున్నారు. దీంతో సదరు ఆటో డ్రైవర్ గురించి విచారించగా..అతనికి హెచ్ఐవీ పాజిటివ్ ఉందని..ఆ విషయం తెలిసి కూడా ఆమె పెళ్లి చేసుకుంది.

దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ..ఆమెకు ఇంకా మైనారిటీ తీరకపోవడంతో ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసి అతనిపై పోక్సో చట్టం కింద కేసును రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశామని తెలిపారు.
తాము వారి వద్దకు వెళ్లి..సదరు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుంటుండగా సదరు బాలిక తమకు అడ్డుకందనీ..అతని గురించి పూర్తిగా తెలిసీ ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను..నా భర్తను అరెస్ట్ చేయటానికి వీల్లేదంటూ రోడ్డుపై బైఠాయించిందని తెలిపారు. నా భర్తతో పాటు నన్ను కూడా తీసుకెళ్లాలని గొడవ చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఆమెను ప్రభుత్వాసుపత్రిలో మరిన్ని పరీక్షల నిమిత్తం చేర్చామని..కేసును విచారించి, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.