Kapil Sibal Slams BJP Over OC Reservations Bill

OC రిజర్వేషన్లకు 3 అడ్డంకులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

OC రిజర్వేషన్ల బిల్లుపై రాజ్యసభలో కాంగ్రెస్ భగ్గుమంది. బిల్లుకి మద్దతిస్తూనే బీజేపీపై విరుచుకుపడింది. బిల్లుని తీసుకొచ్చిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కీలకమైన బిల్లుని ఇంత హడావుడిగా ఆమోదించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ బిల్లుపై చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఉద్యోగాలు కల్పించడం లేదు, ఇక రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? అని నిలదీశారు. ఎలాంటి డేటా లేకుండా, ఎలాంటి నివేదిక లేకుండా హడావుడిగా బిల్లు తెచ్చారని ఫైర్ అయ్యారు. ఎలాంటి డేటా సేకరించకుండా ఈ రాజ్యాంగ సవరణ తేవడంలో అర్థమేంటో చెప్పాలన్నారు. రిజర్వేషన్లు అమలు చేయడానికి విధివిధానాలు ఎలా ఖరారు చేశారో వివరాలు సభ ముందు ఉంచాలని సిబల్ డిమాండ్ చేశారు.

అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యాంగ సవరణపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీ కపిల్ సిబల్.. రిజర్వేషన్ల బిల్లు చట్టపరంగా ఆమోదం పొందడానికి మూడు అవరోధాలు ఉన్నాయని చెప్పారు. బిల్లుపై ముందుగా సెలెక్ట్ కమిటీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కీలకమైన రిజర్వేషన్ల బిల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తీరు బాధాకరం అన్నారు. భారీగా ఉద్యోగాలు రావాలంటే ఆర్థికాభివృద్ధి జరగాలి కానీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

* కేంద్రానికి కాంగ్రెస్ ప్రశ్నలు
* బిల్లు తెచ్చే ముందు ఏమైనా డేటా తీసుకున్నారా
* ఎలాంటి డేటా లేకుండా, ఎలాంటి నివేదిక లేకుండా ఒక్క రోజులోనే బిల్లు తెచ్చి ఆమోదం పొందుతారా
* 8లక్షల వార్షికాదాయం లోపు ఉండాలనుకున్నప్పుడు రెండునర్న లక్షల ఆదాయపు పన్ను పరిమితి ఎత్తేయండి
* ఈ బిల్లు చట్టంగా మారేందుకు మూడు ప్రధాన అడ్డంకులు
* రిజర్వేషన్లపై మోదీ ప్రభుత్వం శ్రద్ధ పెట్టినట్లు లేదు
* 2.5లక్షల నుంచే ఆదాయపన్ను కడుతున్నప్పుడు 8లక్షల ఆదాయం ఉంటే వెనబడినవాళ్లు ఎలా అవుతారు
* నిజమైన పేదలను ఈ రిజర్వేషన్ల పరిధి నుంచి ఎలా తప్పిస్తారు
* నెలకు రూ.5వేలు, రూ.10వేలు సంపాదించే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మాటేంటి? వారు ఆర్థికంగా వెనకబడినవారు కాదా?

Related Posts