karan johar impresed with traILAR OF PRITHVIRAJ 9 MOVIE

అదుర్స్ అంతే : 9 మూవీ రికార్డుల మోత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై  రికార్డులు సృష్టించేందుకు “9” మూవీ రెడీ అయింది. మాలీవుడ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 9 సినిమా చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 9 మూవీ ట్రైలర్ విడుదలైంది. మళయాల నటుడు ప్రతిరాజ్,ప్రకాష్ రాజ్ ,వమిఖా గబ్బి, మమతా మోహన్ దాస్ లు  సినామాలో లీడ్ రోల్స్ లోనటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు అందరి దృష్టిని తనవైపు తిప్పుకొనేలా ఉంది. ట్రైలర్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకొంటున్నాయని సినీ అభిమానులు, దర్శకులు, నిర్మాతలు అంటున్నారు. 

అన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.  ఆల్బర్ట్ గా ప్రతిరాజ్ ఈ సినిమాలో కన్పించనున్నారు. డాక్టర్ ఇనాయత్ ఖాన్ గా ప్రకాష్ రాజ్, ఇవాగా వమిఖా గబ్బి, అన్నీగా మమతా మోహన్ దాస్ ఈ సినిమాలో కన్పించనున్నారు.

ఆశ్చర్యం ఏంటంటే 15 టీవీ చానళ్లు బుధవారం(జనవరి 9,2019) రాత్రి 9గంటల సమయంలో ఈ ట్రైలర్ ని టెలికాస్ట్ చేశాయి. మళయాల సినీ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. మళయాల బాష రాకపోయినప్పటికీ ట్రైలర్ చూసిన డైరక్టర్లు, నిర్మాతలు, సినీ అభిమానులు సినిమా ఎప్పుడు థియటర్లలో చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. 9 ట్రైలర్ చూసిన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ వేదికగా సినిమా ట్రైలర్ అద్భుతం ప్రతిరాజ్ అంటూ ట్వీట్ చేశారు. 

ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ప్రతిరాజ్ నటన ఇరగదీశాడని తెలిపారు. జీనస్ మొహ్మద్ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. ఈ సినిమాను సోనీ పిక్చర్చ్ డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా అందరిలో అంచనాలను పెంచింది. ఫిబ్రవరి 7న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది.

Related Posts