కరీంనగర్ మానేరు డ్యాంలో ఆకట్టుకున్న ‘లేజర్ షో’

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Karimnagar Manair Dam Laser Show : కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్‌లో లేజర్ షో ప్రదర్శన ఆకట్టుకుంటోంది. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు సింగపూర్ తరహాలో ‘హ్యాపీ సండే’ పేరిట నిర్వహించిన లేజర్ ప్రదర్శన కనువిందు చేస్తోంది. బతుకమ్మ సంస్కృతి, దేశ భక్తి ప్రతిబింబించేలా క్రాకర్స్, లేజర్ షో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది.నిండు కుండల లోయర్ మానేరు జలాశయం తీరాన లేజర్ షో వీక్షకులను కట్టిపడేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానానికి అద్దం పట్టేలా… ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రదర్శన కొనసాగుతోంది.

మానేరు నది‌లో బోట్ ఆధారంగా లేజర్, వీడియో షోల ప్రదర్శనను ఆక్వా స్క్రీన్ ఏర్పాటు చేసింది. బతుకమ్మ ప్రాశస్త్యంతో పాటుగా కరీంనగర్ అభివృద్ధి, నేతల చరిత్ర ప్రదర్శనలను కూడా ఈ లేజర్ షోలో ప్రదర్శించారు.లేజర్‌ షోలో మిలమిల మెరిసే కాంతులు విరజిమ్ముతున్నాయి. కరీంనగర్ జిల్లా ప్రజలకు పండుగ కానుకగా నూతనోత్సాహం కలిగేలా గతంలో ఎన్నడూ చూడని ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.ఎల్‌ఎండీని తిలకించేందుకు కరీంనగర్‌ పట్టణం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని, దీనికి తోడుగా డ్యాంలో ఏర్పాటు చేసిన బోటింగ్ లో షికారు చేసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతున్నారు.మానేరు నదీ వేదికగా ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న సంస్థ వారితో కలిసి లేజర్‌ షోతో పాటు క్రాకర్‌ షో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్‌ జిల్లాకు ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉంది. అందుకు అనుగుణంగానే మానేరు డ్యాంపై జిల్లా ప్రజలు కొత్త అనుభూతి కలిగించేలా బతుకమ్మ పండుగ సందర్భంగా లేజర్‌, క్రాకర్‌ షో ఏర్పాటు చేశారు.

Related Posts