Home » అంటరానితం ఇంతలా ఉంటుందా?: దళితుడని ఎంపీని కూడా ఊరిలోకి రానివ్వలేదు
Published
1 year agoon
By
vamsiఈ రోజుల్లో అంటరానితనం ఎక్కడ ఉంది? మాములుగా ఎక్కడైనా ఎక్కువగా వినిపించే మాట ఇదే. బయటకు మాత్రం మనమంతా ఒక్కటే.. ఒక్కటే రక్తం కదా? అంటుంటారు. అయితే మాత్రం ఇంకా కూడా సమాజంలో కొన్నిచోట్ల అంటరానితం ఉంది. ఇందుకు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు కూడా ఇందుకు అతీతులు కాదు. మనమంతా భారతీయులం అంటూ మనం మన ఆధ్యాత్మికతను గురించి గొప్పలు చెప్పుకుంటాం. కానీ మనుషులందరూ సమానమే అని అంగీకరించట్లేదు.
తక్కువ కులం వాళ్లు ఊళ్లోకి వస్తే పెద్ద కులస్తులు మలినం అయినట్లా? అంటరానివారు అని కొందరిని వెలేసేవాళ్లు సమాజంలో ఇంకా ఉన్నారా? దళితులు దేవాలయాల్లోకి ప్రవేశిస్తే దేవుళ్ళు ఆగ్రహిస్తారా? ఒకేబావిలో అందరూ నీళ్లు తాగితే తాగేనీరు కలుషితం అవుతుందా? 21వ శతాబ్దంలో కూడా ఇంకా ఇలా ఆలోచించే మనుషులు ఉన్నారు. అవును ఇది నిజమే. వివరాల్లోకి వెళ్తే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటకలోని చిత్రదుర్గ పార్లమెంటు సభ్యుడు నారాయణ స్వామిని తన సొంత నియోజకవర్గంలోని ఓ గ్రామంలోకి రానివ్వలేదు పెద్ద కులస్తులు.
నారాయణస్వామి దళితుడంటూ ఆ గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు. దళిత నేత అయిన నారాయణ స్వామి పవడగ తాలూకాలోని గొల్లరహట్టి గ్రామానికి వెళ్లగా ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది. యాదవుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటే ఈ గ్రామంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ఇళ్లులేని వారికి ఇళ్లు కట్టించేందుకు, దీనిపై గ్రామస్థులతో చర్చించేందుకు ఎంపీ వెళ్లారు. అయితే ఆ గ్రామానికి ఎంపీ చేరుకుని లోపలికి వస్తున్న సమయంలో నారాయణ స్వామిని అడ్డుకున్నారు. ‘దళితులకు ఊళ్లోకి ప్రవేశం లేదు’ అంటూ అడ్డు చెప్పారు.
పేదలను ఆదుకునేందుకే వచ్చినట్టు చెప్పినా కూడా గ్రామస్తులు పట్టించుకోలేదు. గ్రామం బయటే కూర్చోవాలని అక్కడికే అవసరమైనవాళ్లు వస్తారంటూ ఎంపీకి గ్రామస్తులు గ్రామం బయట కుర్చీ వేశారు. ఎంపీ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనం లేదు. కొద్ది సేపటి తర్వాత గ్రామంలోని కొందరు లోపలికి రమ్మని ఎంపీ రాలేదు. తన వల్ల తాను వెళ్లిపోగానే గ్రామస్తులు కొట్టుకుంటే మంచిది కాదనే ఉద్ధేశ్యంతో ఎంపీ ఆ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, తనకు ఎదురైన చేదు అనుభవంపై ఎంపీ నారాయణ స్వామి మాట్లాడుతూ.. వారిపై కేసు నమోదు చేయాలని అనుకోవట్లేదని, వాళ్లలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందరమూ ఒకే మాంసం ఒకే రక్తం కలిగి ఉంటామని వివక్ష ఎందుకని అన్నారు.