పరువు హత్య, కూతురిని చంపేసిన తండ్రి, సహకరించిన సోదరుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

karnataka girl killed by family ఫ కుల జాఢ్యం కారణంగా ఎంతో మంది హత్యకు గురవుతున్నారు. సాంకేతికతో దూసుకపోతున్న తరుణంలో..పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అదృశ్యమైన యువతి విగత జీవిగా కనిపించిన కేసులో తండ్రే నిందితుడని తేలింది.పరువు హత్యగా నిర్ధారించారు. అన్యమతస్తుడిని ప్రేమించి పరువు తీసిందనే కోపంతో తండ్రి, సోదరుడు, మరో బాలుడు కలిసి ఆమెను అంతమొందించారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. నిందితులను అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.మాగడి తాలూకా బెట్టహళ్లి గ్రామానికి చెందిన హేమలత (18), కుదూరు కళాశాలలో బీకాం చదువుతోంది. ఈ క్రమంలో..హేమలత కనిపించకుండా పోయింది. అక్టోబర్ 11వ తేదీన ఓ తోటలో పూడ్చిన స్థితిలో విగతజీవిగా కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.ఆమె చదువుతున్న కళాశాలలో అన్యమతస్తుడయిన యువకుడిని మూడేళ్లుగా ప్రేమిస్తోందని వెల్లడైంది. దీనిని హేమలత కుటుంసభ్యులు వ్యతిరేకించారు. ఇరువైపులా పెద్దల పంచాయతీ కూడా జరిగింది. పరువు పోయిందని తండ్రి కృష్ణప్ప(48) కోపంతో రగిలిపోయేవాడు. ఇంటి పరువు తీసిందని అంతమొందించాలని నిర్ణయం తీసుకున్నాడు.ఇతనికి పెదనాన్న కుమారుడు చేతన్‌(21)ను మైనర్‌ బాలుడు సహాయం అందించారని నిర్ధారించారు. తొలుత ప్రియుడే హత్య చేశాడని వదంతులు సృష్టించారు. పోలీసుల విచారణలో తండ్రి, సోదరుడు, మరో బాలుడు అంతమొందించారని తేల్చారు. అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

Related Posts