లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

అన్ని గ్యాంగ్ రేప్‌లకు ఉరిశిక్షే కరెక్ట్ : కర్ణాటక హైకోర్టు

Published

on

దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న క్రైమ్ రేటును దృష్టిలో ఉంచుకుని కర్ణాటక హైకోర్టు అన్ని Gangrapeలకు ఉరిశిక్షనే కరెక్ట్ అని రికమెంట్ చేసింది. Gangrape అనేది మర్డర్ కంటే చాలా ప్రమాదకరం. దానికి జీవితఖైదుతో పాటు జరిమానా సరిపోదని తేల్చి చెప్పింది.

2012లో బెంగళూరు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ పై జరిగిన గ్యాంగ్ రేప్ లోని నిందితులకు జీవిత ఖైదు విధించిన కేసుపై మరోసారి చర్చించింది.బీ వీరప్ప, కే నటరాజన్ అనే జస్టిస్‌లతో డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి అమెండ్‌మెంట్స్ ను పంపింది. ఐపీసీ సెక్షన్ 376డీ ప్రకారం గ్యాంగ్ రేప్ కేసులో ఏం చేయాలనే దానిపై విచారణ జరిపింది.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376డీ ఆధారంగా.. గ్యాంగ్ రేప్ అనే నేరానికి చాలా పెద్ద శిక్ష మాత్రమే ఉండాలి. ప్రస్తుతం ఉన్న జీవిత ఖైదు జరిమానా సరిపోవని తేల్చింది. రేప్ అనేది ఓ మహిళపై జరిపినట్లు కాదు.. సమాజం మొత్తం మీద దాడి చేసినట్లు అవుతుంది.

gang rape

నేపాల్ నుంచి బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చిన లా స్టూడెంట్ పై ఎనిమిది మంది నిందితులు రాము, శివన్న, మద్దుర, ఎలెయ్య, ఎరయ్య, రాము, దొడ్డ ఎరయ్యలు లైంగిక దాడికి పాల్పడ్డారు. 2012 అక్టోబరు 13న గాంధీ భవన్ లోని బెంగళూరు యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలోని హాస్టల్ వద్ద ఫ్రెండ్ డ్రాప్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది.

ఇది దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయం. నిందితులపై ఎటువంటి కుదింపులు లేవు అని కోర్టు స్పష్టం చేసింది. ఇండియాలో చాలా తక్కువ రేప్ కేసుల్లో మాత్రమే ఉరిశిక్షను విధిస్తున్నారు. పొక్సో చట్టం ప్రకారం.. 16ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వారిపై జరిగితే మాత్రమే ఉరిశిక్ష విధిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *