తల్లితో సహజీవనం….కూతురుతో పెళ్లి….

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కర్ణాటకలో దారుణం జరిగింది. కూతురు క్షేమం కోరాల్సిన తల్లి మైనర్ కూతురు జీవితాన్నినాశనం చేయబోయింది. పడక సుఖం కోసం తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని వదులుకోలేక అతడికి తన కన్నకూతుర్ని కట్టబెట్టాలనుకుంది. సమయానికి పోలీసులు వచ్చి ఆ బాలికను రక్షించారు.

కర్ణాటక లోని దావణగెరే లో మాధవి(45)(పేరు మార్చాము) భర్తతో విభేదాల కారణంగా అతడి నుంచి విడాకులు తీసుకుని. కూతురుతో కలిసి విడిగా వచ్చి జీవనం సాగిస్తోంది. స్ధానికంగా ఉన్న ఒక కంపెనీలో పని చేస్తూ మైనర్ కూతురుని చదివిస్తోంది. ఈ క్రమంలో ఆమె పనిచేస్తున్న కంపెనీలోని రంగనాధ్(28) అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.



ఒకే సంస్ధలో పని చేయటంతో ఇలాంటవి సహజంగానే జరుగుతూ ఉంటాయి. రంగనాధ్ అవివాహితుడు. మాధవితో పరిచయం క్రమేపి మరింత చనువుగా మారింది. ఆఫీసుకు సెలవులప్పుడు రంగనాధ్ మాధవి ఇంటికి వచ్చి వెళ్ళటం మొదలైంది. ఈ స్నేహం పెరిగి ఇద్దరూ మరింత సన్నిహితంగా మెలగసాగారు.

క్రమేపి అది వారిద్దరి మధ్య లైంగిక సంబంధానికి దారితీసింది. అవకాశం చిక్కినప్పుడల్లా వారిద్దరూ శారీరకంగా కలిసి తమలోని కామతృష్ణ ను తీర్చుకుంటున్నారు. మైనర్ కూతురుకు మాధవి నచ్చ చెప్పుకుంది. కూతురు కూడా తల్లి చేసే పనికి అభ్యంతరం వ్యక్తం చెప్పలేదు. తమ కుటుంబాన్ని చూసుకునే ఒక మగ తోడు ఇంట్లో ఉన్నాడనుకుంది.



తన కంటే వయస్సులో పెద్దదైన మాధవి ఆంటీతో ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా సర్దుకుపోతుండటంతో రంగనాధ్ కు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. దాంతో ఇద్దరూ ఒకే ఇంట్లో భార్యా భర్తల్లా సహజీవనం చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రంగనాధ్ కు స్వగ్రామంలోని వాళ్ల పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. ఈ సంగతి మాధవి కి చెప్పాడు.

రంగనాధ్ పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తన కోరికలు తీరేదెట్టా. మొగుడ్ని వదిలేసి వచ్చిన కొన్నాళ్ళ నుంచి రంగనాధ్ పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి మాధవి సంతోషంగానే ఉండసాగింది. రంగనాధ్ తనకు అన్ని రకాలుగా అండగా ఉన్నాడు.



పడక సుఖాన్ని ఇస్తున్నాడు. తన కంటే వయస్సులో చిన్నవాడైనా మాధవిని ప్రేమగా చూసుకోవటంతో అతడిని దూరం చేసుకోలేక పోతోంది. వేరొకరిని పెళ్లి చేసుకోవద్దని బతిమాలింది. తనను విడిచి వెళ్లవద్దని వేడుకుంది.

కానీ రంగనాధ్ ఇంట్లో కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడటం ఆపలేదు. చివరికి ఓ ఆలోచన చేసింది, తన మైనర్ కూతుర్నచ్చి రంగనాధ్ కు పెళ్లి చేయాలనుకుంది ఈ విషయం రంగనాధ్ కు చెప్పింది. అందుకు అతను ఓకే అన్నాడు.



హమ్మయ్య కూతురుకు మొగుడు దొరుకుతాడు. రంగనాధ్ ఎక్కడికీ పోడు. తనకు కోరికలు తీరుతాయనుకుంది. ఈ విషయం కుమార్తెకు చెప్పింది. అది విన్న మైనర్ బాలిక షాక్ కు గురైంది. తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తితో తనకు పెళ్లేంటని తల్లిని నిలదీసింది. తల్లి నచ్చచెప్పటానికి ప్రయత్నించింది.

ఈలోగా ముహూర్తం నిర్ణయించుకున్నారు. తల్లి చేస్తున్న పని నచ్చని బాలిక తనలో తానే మధన పడసాగింది. పెళ్లి గండం నుంచి ఎట్టాగైనా తప్పించు కోవాలనుకుంది. ఈ విషయాన్ని తన క్లాస్ మేట్ కు చెప్పింది. వాళ్లిద్దరూ ఒక ప్లాన్ వేసుకున్నారు. అనుకున్న రోజుకు పెళ్లి ముహూర్తం రానే వచ్చింది.



గుళ్లో పెళ్లి కి ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి కార్యక్రమం మొదలైంది. మాధవి, రంగనాధ్ మహా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అనుభవించే సుఖాలను ఊహించుకుంటూ పొంగిపోతున్నారు.

మరి కొద్ది సేపట్లో రంగనాధ్ మాధవి కూతురు మెడలో మూడుముళ్ళు వేయబోతున్నాడు. ఇంతలో పోలీసులు ఎంటరై రంగనాధ్ ను, మాధవిని అదుపులోకి తీసుకుని బాలికను, సంరక్షణా కేంద్రానికి తరలించారు. దావణగెరే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts