లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

భార్యా,కూతుర్ని కాపాడుకోటానికి చిరుతతో పోరాటం

Updated On - 6:08 pm, Tue, 23 February 21

karnataka-man-killed-the-tiger-to-save-his-daughter-and-wife1

karnataka man killed the leopard : తెలుగు,తమిళ సినిమాల్లో హీరోయిన్లను రక్షించటానికి హీరోలు వీరోచితంగా సింహాలు పులులతో పోరాడి వాటిని హతమార్చిన సీన్లు ఎన్నో చూశాం. కానీ నిజ జీవితంలో భార్యా పిల్లలనుకాపాడుకోటానికి ఓకన్నడిగుడు చిరుతతో పోరాడి దాన్ని హతమార్చిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

హసన్ జిల్లా హరిసెక్రె తాలూకా, బెండెకెరే ప్రాంతంలో భార్య కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతున్నరాజగోపాల్ నాయక్ కుటుంబంపై పులి దాడి చేసింది. దీంతో వీళ్లు ముగ్గురు ఒక్కసారిగా కింద పడిపోయారు. పులి భార్యా కూతురు మీదకు లంఘించే సరికి రాజగోపాల్ నాయక్ పులితో పోరాటం సాగించాడు.

వీరోచితంగా పోరాడి పులిని చంపేసి భార్యా కూతురును కాపాడుకున్నాడు. ఈక్రమంలో రాజగోపాల్ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరుగుతున్నసమయానికి అక్కడకు చేరుకున్న స్ధానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.