యువత భవిత నాశనమవుతోంది..రమ్మీని నిషేధించండి : MP డిమాండ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆన్‌లైన్ రమ్మీ గేమ్ నిషేధించాలని బీజేపీ ఎంపీ కేసీ రామ్మూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దక్షిణ భారత దేశంలో చాలామంది ఆన్‌లైన్ రమ్మీ గేమ్ యువత బానిసలుగా మారుతున్నారనీ..దేశానికి వెన్నెముక అయిన యువత ఇలా రమ్మీ గేములకు అలవాటు పడటం సరైంది కాదని కాబట్టి దీన్నీ నిషేధించాలని కేంద్రాన్ని ఎంపీ డిమాండ్ చేశారు. రమ్మీ ఆన్‌లైన్‌ గేమ్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించి నిషేధించాలని కేంద్రాన్ని కోరారు.


మారటోరియం కేసు: సెప్టెంబర్ 10 వరకు వాయిదా.. ఏ ఖాతాను ఎన్‌పిఎగా ప్రకటించొద్దు


పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో మంగళవారం (సెప్టెంబర్ 15,2020)న ఎంపీ కేసీ రామ్మూర్తి రాజ్యసభలో మాట్లాడుతూ..ఆన్ లైన్ రమ్మీ గురించి ప్రస్తావించారు. ‘రమ్మీని నైపుణ్యం గల ఆటగా ప్రచారం చేస్తున్నా అదికూడా ఒక జూదమే. జూదానికి అలవాటుపడితే ఇల్లు గుల్ల అయిపోతుంది. కుటుంబాలు అప్పుల ఊబిలో దిగిపోతాయి. కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వస్తుంది.. దీనికి బానిసలు అవుతున్న చాలామంది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. తద్వారా అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయని దయచేసి ఈ గేమును నిషేధించాలని ఆయన కోరారు.


రమ్మీ ఆట అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. సినీ, క్రీడారంగ ప్రముఖులతో ప్రకటనలు..ప్రమోషన్లతో యువతను ఆకర్షిస్తోంది. ఆడుకుంటూనే చక్కగా డబ్బులు సంపాదించవచ్చని ఆశచూపి యువతను ఈ రమ్మీ ఊబిలోకి దింపుతోంది. బానిసలుగా మారుస్తోంది. దీంతో యువత డబ్బులు పోగొట్టుకుంటున్నారు. డబ్బుల కోసం నేరాలకు సైతం పాల్పడుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు. దీంతో వారి భవిష్యత్తు నాశనమవుతోంది. పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అని ఎంపీ రామ్మూర్తి ఆందోళన వ్యక్తంచేశారు.


ఆన్‌లైన్‌ రియల్‌ మనీ గేమింగ్‌ వ్యాపారం రూ.2,200 కోట్లుగా ఉందని కేజీఎం నివేదిక అంచనా వేసిందని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు. ఇది ప్రతీ సంవ్సరం 30 శాతం పెరుగుతోందనీ..ఇదే కొనసాగితే..ఈ రమ్మీ వ్యాపారం 2023 నాటికి రూ.12వేల కోట్లకు చేరే అవకాశం ఉందని నివేదిక పేర్కొందని తెలిపారు. యాపిల్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ సంస్థలతో సహా ప్రపంచంలో మరే సంస్థలోనూ ఇంత వేగవంతమంతంగా మారిన గేమును తాను చూడలేదని..ఇది ఏ స్థాయిలో విస్తరిస్తుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉందనే దేశ యువత భవితను కాపాడాల్సిన అవసరం చాలా ఉందని ఎంపీ కోరారు.

Related Posts