లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

హెల్మెట్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..ప్రభుత్వం సంచలన నిర్ణయం

Published

on

Karnataka Riding without a helmet : మోటార్ వాహన చట్టం అమలులోకి వచ్చాక జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఇదంతా ప్రజల భద్రత కోసమే అయినా చాలామంది నిబంధల్ని బేఖాతరు చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. టూ వీలర్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిచేశారు. పోలీసులు పదే పదే ఈ విషయం చెబుతున్నారు. ఫైన్లు కూడా విధిస్తున్నారు. కానీ చాలామంది ఫైన్లు కట్టేస్తే పోతుంది ఈ హెల్మెట్ గోలేందీ అన్నట్లుగా ఉంటున్నారు.


షాకింగ్ వీడియో, కారు బ్యానెట్ పై ట్రాఫిక్ పోలీసు


ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బైక్‌పై వెళ్తున్న వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని ఆదేశించింది. ఆదేశాలతో సరిపెట్టకుండా హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తే మూడు నెలల పాటు లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ తాజా ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేసింది.


మోటార్ వాహన చట్టం సెక్షన్ 129 ప్రకారం బైక్‌ నడిపేవారే కాదు బైక్ వెనుక కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెంట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లైసెన్స్ కోల్పోకుండా ఉండాలంటే నిబంధనలు పాటించాలని సూచించారు. అలాకాని పక్షంలో లైసెన్స రద్దుతో పాటు రూ. 1000 జరిమానా కూడా ఉంటుందని హెచ్చరించారు. ఈ లేటెస్ట్ ఆదేశాలతో ఇక నుంచి బైక్‌పై వెళ్తున్నవారు జాగ్రత్త పాటించక తప్పదు గాక తప్పదు. లేదంటే లైసెన్స్ రద్దు ప్లస్ జేబులు కూడా ఖాళీ అవ్వటం తప్పదు.


బెంగళూరు నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలలో హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారు చాలా ఎక్కువగా ఉన్నారనీ..లాక్డౌన్ పరిమితులను సడలించిన తర్వాత ఇటువంటి ఉల్లంఘనలు పెరిగాయని బెంగళూరు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.


సెప్టెంబర్ 13, 19 మధ్య, ట్రాఫిక్ పోలీసులు 43,141 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను బుక్ చేసి 14 2.14 కోట్ల జరిమానాను వసూలు చేశామనీ..ఆ తరువాత వారంలో 55,717 కేసులను బుక్ చేసి 35 2.35 కోట్లు వసూలు చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ లో 29,925 కేసులు బుక్ చేశామని తెలిపారు.


ఈ కొత్త నిబంధన ప్రకారం ఇక హెల్మెట్ లేకుండా బైక్ పై నడిపితే కేసులు బుక్ చేయటాలు ఉండవని నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలలపాటు క్యాన్సిల్ చేస్తామని లైసెన్స్ రద్దుతో పాటు రూ.1000 జరిమానా కూడా తప్పని హెచ్చరించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *