లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

కావాలనే కాల్చాడా? : తుపాకీ కాల్చడం నేర్పిస్తానని..భార్య తలలో బుల్లెట్ దింపేసాడు..!!

Published

on

Karnataka woman killed in gun firing..husband tries : భర్తలు భార్యలకు స్కూటీ నేర్పించడం, కారు డ్రైవింగ్ నేర్పించటం వంటివి చూశాం.కానీ తుపాకీ ఎలా పేల్చాలో నేర్పించటం ఎక్కడన్నా చూశారా?పోనీ విన్నారా?అంటేలేదనే అంటాం.కానీ ఓ భర్త ఏకంగా తన భార్యకు ఘన్ తో ఎలా షూట్ చేయాలో నేర్పించేందుకు యత్నించాడు. పాపం అదికాస్తా ఆ ఆమె తలలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే కుప్పకూలి మరణించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

కర్నాటకలోని తుమకూరు జిల్లా డి. కొరటిగెరె గ్రామానికి చెందిన కృష్ణప్ప అనే 35 యువకుడు తన భార్య శారదకు తుపాకీ ఎలా పేల్చాలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. మరి అతనికి ఆ అవసరం అంత అవసరం ఏం వచ్చిందో తెలీదు గానీ..గత సోమవారం (జనవరి 11,2021) రాత్రి తన ఫ్రెండ్ దగ్గరనుంచి తుపాకీ తీసుకొచ్చి మరీ దాన్ని ఎలా పేల్చాలో నేర్పిస్తున్నాడు. దీంట్లో భాగంగా తుపాకీని ఎలా పట్టుకోవాలి..ఎలా గురిపెట్టాలి అంటూ నేర్పిస్తున్నాడు. ఎలా కాల్చాలో చూపించాడు.

ఈక్రమంలో ఏం జరిగిందో..ఎలా జరిగిందో తెలీదు గానీ..భార్యకు తుపాకీ కాల్చటం నేర్పిస్తుండగా ఆ తుపాకీ కాస్తా ‘ఢాం’మని పేలింది. అంతే తుపాకీలోంచి తూటా కృష్ణప్ప భార్య శారద తలలోకి దూసుకుపోయింది. పాయింట్ బ్లాంక్‌లో బుల్లెట్ నేరుగా ఆమె తలలో దిగిపోవటంతో తీవ్ర రక్తస్రావమై.. అక్కడికక్కడే శారద కుప్పకూలి మరణించింది.

తుపాకీ పేలిన శబ్ధం విన్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అర్థం చేసుకోవాటానికి వాళ్లకు కాస్త సమయం పట్టింది. తరువాత అసలు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మృతురాలి భర్త కృష్ణప్పతో పాటు నాటు తుపాకీ వాడుతున్న అతడి మిత్రుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐతే కృష్ణప్ప తన భార్యను కావాలనే చంపేశాడా? లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై కృష్ణప్ప, శారద కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కూడా ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *