లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మా గుండెలనిండా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం సార్.. బాలు గారి గొంతు మళ్ళీ వినిపించేలా చేద్దాం..

Published

on

sp balasubramaniam: సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోవిడ్-19తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. బాలు క్షేమంగా తిరిగి రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సామన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఆయన క్షేమాన్ని కాంక్షిస్తున్నారు.తాజాగా హీరో కార్తి, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ బాలు గారు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. ‘‘బాలు గారి ఆరోగ్యం మెరుగు పడడానికి మనం అందరమూ ప్రార్ధిద్ధాం.. రేపు ఆగస్టు 20 సాయంత్రం 6 గంటలకు మన ప్రియమైన ఎస్.పి.బి సార్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం.. మేము మా గుండెల నిండా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము SPB సార్!’’ అంటూ ట్వీట్ చేశారు.సంగీత దర్శకుడు జీ వి ప్రకాష్ మాట్లాడుతూ: ‘‘ప్రముఖ గాయకులు ఎస్.పి.బి గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. మీరు వున్న ప్రదేశంలో ఆగస్టు 20, సాయంత్రం 6 గంటలకు సామూహిక ప్రార్థనలలో పాల్గొనండి. బాలు గారి గొంతు మళ్ళీ వినిపించేలా చేద్దాం’’.. అని పేర్కొన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *