Karthika Masam First Monday Huge Rush In Temples

తొలి కార్తీక సోమవారం..కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేకంగా మహాన్యాస పూర్వ రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ మాసంలో దీపాలు వెలిగించి దేవాతామూర్తులను దర్శించుకొని మొక్కులు చెల్లించకుంటే..సర్వ పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు ఉదయాన్నే ధర్మగుండంలో స్నానాలు చేసి ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగించి దర్శనం చేసుకుంటున్నారు.

ఆలయ అర్చకులు పార్వతి పరమేశ్వరలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోత్సవాలతో అభిషేకాలు నిర్వహించారు. 1200 టికెట్‌తో మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు బ్రేక్ దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ టికెట్లు తీసుకున్నవారికి దంపతులు గర్భగుడిలోకి ప్రవేశించి స్వామి వారికి అభిషేకాన్ని నిర్వహించవచ్చు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో స్థానిక శివాలయం, హరి హర క్షేత్రం దేవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పూజలు చేస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుని పూజిస్తున్నారు. శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. 

ఖమ్మం నగరం శైవ క్షేత్రాలు కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజామునుంచే దేవాలయలకు భక్తులు పోటెత్తారు. దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ధూప, నాగ, రుద్ర, సూర్య, నేత్ర, నంది, సింహ, చక్ర, కుంభ హారతులను సమర్పించారు. 

జిల్లా మణుగూరులో భక్తులు ఆలయాల్లో పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహిస్తున్నారు.  మణుగూరు శివలింగపురంలోని శివాలయంలో తెల్లవారు జామున నాలుగు గంటల సమయం నుండే మహిళలు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. శివనామస్మరణతో శ్రీగిరులు మారుమోగాయి. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మకు కార్తీక దీపాలు వెలిగించి అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనానికి కంపార్ట్ మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామి అమ్మవార్ల సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. 

నాగుల కట్ట వద్ద, ఉసిరిచెట్ల కింద గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రుద్రహోమం, చండిహోమంలను రెండు విడతలుగా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో పలు సేవలను రద్దు చేశారు అధికారులు. 

శ్రీకాకుళం జిల్లాలోని శైవ క్షేత్రాలు కార్తీకమాసం సందర్భంగా భక్తులతో కిటకిట లాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఉమారుద్రకోటేశ్వర ఆలయంతో పాటు, ప్రాచీన క్షేత్రం శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయాల్లో ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. సమీపంలోని నదులలో కార్తీక స్నానాలు ఆచరించి శివాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి పూజలు నిర్వహించారు. 

READ  హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు: ఐదుగురు అరెస్ట్

కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శివ నామస్మరణతో విజయవాడలోని శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చే శ్రవణా నక్షత్రం కావడంతో శివాలయాల వద్ద కోటి దీపాలు వెలిగించారు.
Read More : 

Related Posts