‘ఇస్లాం’ సబ్జెక్ట్ లో హిందూ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

kashmir Non muslim student got first rank islamic studies : కశ్మీర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని ఇస్లాం మత విద్యను నేర్చుకోవడానికి నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్షలో ఓ హిందూ విద్యార్థి ఫస్ట్ ర్యాంకు సాధించాడు. రాజస్తాన్‌కు చెందిన శుభమ్‌ యాదవ్‌ అనే 21ఏళ్ల విద్యార్థి గత రికార్డుల్ని రిమూవ్ చేస్తూ..ఇస్లాం మతవిద్యలో టాప్‌ ర్యాంకు సాధించాడు.ఈ సందర్భంగా శుభమ్ మాట్లాడుతూ..హిందువులు, ముస్లింలు పరస్పరం ఇతర మతాల గురించి తెలుసుకోవాలని శుభమ్‌ సూచించాడు. ‘‘ఇస్లాం మతంపై అతివాద ముద్ర పడింది. ఆ మతం గురించి సమాజంలో ఎన్నో దురభిప్రాయాలు ఉన్నాయని తెలిపాడు. ఈ దురభిప్రాయాల వల్లనే సమాజంలో చీలికలు వచ్చాయి. ఒక మతం గురించి మరొక మతం వారికి తెలియకపోవటం ఇటువంటి సమస్యలు వస్తుంటాయని అన్నాడు. సమాజంలో దురభిప్రాయాలు పోవాలంటే రెండు మతాల వారు పరస్పరం అవగాహన పెంచుకోవాలని శుభమ్‌ అభిప్రాయపడ్డాడు.


ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై చిదంబరం ఆందోళన


2015లో ఏర్పాటైన కశ్మీర్‌ యూనివర్సిటీలో ఒక ముస్లిమేతరుడు టాప్‌ ర్యాంకు సాధించడం ఇదే తొలిసారి. అల్వార్‌ ప్రాంతానికి చెందిన యాదవ్‌ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో బీఏ చేశాడు. రెండేళ్ల క్రితం తమ ప్రాంతంలో మైనార్టీలను కొట్టి చంపిన ఘటనలు వెలుగు చూడడంతో ఇస్లాం మతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిందని శుభమ్‌ యాదవ్‌ తెలిపారు. సివిల్ లో చక్కటి ర్యాంక్ సాధించాలని శుభమ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. శుభం తండ్రి ఓ బిజినెస్ మెన్ కాగా తల్లి గృహిణి. ఇస్లాం గురించి చదవాలనే తన అభిప్రాయాన్ని తన తండ్రి పోత్సహించారని శుభమ్ తెలిపాడు.భారతదేశంలోని 14 కేంద్ర యూవర్శిటీల్లో కశ్మీర్‌లోని కాలేజీలు మాత్రమే ఇస్లామిక్ స్టడీస్‌లో కోర్సును అందిస్తున్నాయి. అలాగే జగద్గురు రామానందచార్య రాజస్థాన్ లోని యూనివర్శిటీలో సంస్కృత పిహెచ్‌డి చేస్తున్న ముస్లింలు చాలా మంది ఉన్నారు. మతాల మధ్య ఉండే విభేధాలను దురభిప్రాయాలు దూరం కావాలంటే ఒకరి మతం గురించి మరొకరు తెలుసుకోవాలని పలువురు విద్యావేత్తలు సైతం సూచిస్తున్నారు.

Kashmir non islamic student

ఏది గురించి అయినా మాట్లాడాలి అన్నా..విమర్శించాలన్నా ఆయా విషయాలపై అవగాహన ఉండాలని..అవగాహన లేకుండా విమర్శలు చేయటం వివేకవంతుల లక్షణం కాదని సూచిస్తున్నారు. ఇలా ఒకరి మతాల గురించి మరొక మతం వారు తెలుసుకోవటం చాలా మంచి పరిణామని విద్యావేత్తలు పేర్కొన్నారు.
దీని గురించి విశ్వవిద్యాలయంలోని విభాగాధిపతి శాస్త్రి కోసలేంద్ర దాస్, ఇది స్వాగతించే దశ. “ఎటువంటి పక్షపాతం లేకుండా ఇతర మతాలను పరిశీలించడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు సానుకూల చర్య. అనేక ఇతర సమాజ విద్యార్థులు విశ్వవిద్యాలయంలో సంస్కృతం చదువుతున్నారు. ఇది రెండు వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ”అని దాస్ అన్నారు. రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగంలో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు హిందువులు ఉన్నారు. రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ రష్మి జైన్ మాట్లాడుతూ, ఇది ఉద్యోగాల కోసమా, విద్యార్థుల ఆసక్తి కోసమా, కానీ ఇప్పుడు-ఒక రోజుల్లో సమాజాల ప్రాతిపదికన విద్యలో సరిహద్దులను పలుచన చేయడం జరిగింది.

Related Tags :

Related Posts :