లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఎర్ర బంగారం : కాశ్మీర్‌లో కోతకొచ్చిన కుంకుమపూలు..ఆ అందం చూసి తీరాల్సిందే..

Published

on

Kashmir Saffron Very demanding : కుంకుమపువ్వు అనగానే గర్భంతో ఉండే మహిళలు గుర్తుకొస్తారు. గర్భిణులు పాలల్లో కుంకుమ పువ్వు కలిపి తాగితే పుట్టే పిల్లలు తెల్లగా పుడతారని అంటారు. అది ఎంత వరకూ నిజమో గానీ..పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. గర్భిణిలకు జీర్ణవ్యవస్థ మెరుగు పడి ఎటువంటి ఇబ్బందులు రావు. చక్కటి నిద్ర పడుతుంది. దీంతో గర్భిణులు ఒత్తిడి కలుగకుండా ఉంటుంది.ఒత్తిడి లేకండా ఉంటే పుట్టబోయే బిడ్డ చక్కటి ఆరోగ్యంతో పుడుతుంది. అంతేకాదు..గర్భిణులకు మూత్ర విసర్జన సమస్యలు వస్తుంటాయి. కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని తాగితే ఆ సమస్య రాకుండా ఉంటాయి. అలాగే చక్కటి ఆరోగ్యాన్నిచ్చే కుంకుమ పువ్వు తీసుకోవాటంలో ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అప్పటిలా కుదరవ్ భయ్యా : వాకిట్లో వధూవరులు..కార్లలో కూర్చునే ఆశీర్వాదాలు


కుంకుమ పువ్వు. అందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే వర ప్రదాయిని. మనం వాడే సుగంధ ద్రవ్యాల్లో అత్యంత ఖరీదైనది ఈ కుంకుమపువ్వు. కుంకుమ పూలను సాగుచేస్తున్న దేశం ఇరాన్ నే అయినా ఈ కుంకుమ పూలను మన భారత దేశంలోని కశ్మీర్ లో రైతులు పండిస్తుంటారు.
జమ్మూకాశ్మీర్ అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేవి తెల్లని..చల్లని మంచు పర్వతాలు, యాపిల్ తోటలు, పరవశింపజేసే ప్రకృతి అందాలు, అందమైన రంగు రంగుల్లో కనువిందు చేసే  తులిప్ పూల తోటలు గుర్తుకొస్తాయి. అంతేకాదు అంత అందమైన కశ్మీర్ లో ఉగ్రదాడులు గుర్తుకొస్తే గుండెలు హడలిపోతాయి. ఉగ్రచర్యలతో పాటు అందాలకు నిలయం కశ్మీరం.

 అంతేకాదు అందమైన కశ్మీరంలో కుంకుమపూల సాగు చాలా ప్రత్యేకమైనది. చలికాలం వచ్చేసరికి కుంకుమ పూలు పుడమితల్లి గర్భంలోంచి పుట్టుకొస్తాయి. నేలమ్మ తల్లి కడుపులోంచి బయటకొచ్చి విచ్చుకుంటాయి. దీంతో నేలంతా పర్పుల్ కలర్ రంగు వేసినట్లుగా చూస్తే కళ్లు తిప్పుకోలేనంత అందంగా కనిపిస్తుంది. కుంకుమ పువ్వు అంటే పర్పుల్ కలర్ కనిపించేది కాదు. ఆ పువ్వు మధ్యలో ‘‘ఎర్రటి రంగులో రేకలే’’ కుంకుమ పువ్వు. వాటిని పూల నుంచి వేరు చేసి అతి జాగ్రత్తగా సేకరిస్తారు.ఈ పూల మధ్యలో ఉండే ఎర్రని రేకులను అత్యంత జాగ్రత్తగా విడదీసి సేకరించి ప్యాక్ చేస్తారు. వీటినే మనం వంటలు, స్వీట్లలో..సౌందర్య సాధనాల్లో వాడుతుంటాం. ప్రపంచ వ్యాప్తంగా కంకుమ పూలకు మంచి డిమాండ్ ఉంది. 75,000 నుంచి లక్ష పూలతో… కేవలం 450 గ్రాముల కుంకుమపువ్వు మాత్రమే వస్తుంది. అదే సుగంధద్రవ్యం. అందుకే దానికి అంత ధర పలుకుతుంది.పర్పుల్ రంగులో ఉండే పూలను రైతులు చేతులతో జాగ్రత్తగా తెంపుతారు. ప్రతి పువ్వులోనూ మూడు రంగులున్నా… మొత్తంగా పర్పుల్ కలర్‌లో కనిపిస్తాయి. కుంకుమపూలను ‘‘గోల్డెన్ మసాలా’ అని పిలుస్తారు. ఎందుకంటే… మసాలా దినుసుల్లో కుంకుమపూలే ఎక్కువ రేటు కాబట్టి. కుంకుమపూలను మందుల తయారీలోను..సౌందర్య సాధనాల్లోను.పెర్ఫ్యూమ్ వంటివాటిలో వాడుతుంటారు. ఇక వంటలు, స్వీట్లలో ఎలాగూ కుంకుమపువ్వు స్థానం దేనికీ ఉండదంటే అతిశయోక్తికాదు. అందుకే… ప్రస్తుతం కేజీ కుంకుమపువ్వు (ఎరుపు రేకలు)… రూ.3 లక్షలకు పైగారే ధర పలుకుతోంది. ఒక్క గ్రాము కావాలంటే రూ.300 చెల్లించాల్సిందే.
భారత్ లోని జమ్మూకాశ్మీర్‌లోని 200 గ్రామాల్లో వేల మంది రైతులు… కుంకుమ పువ్వుల పంటను సాగుచేస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితి వల్ల పంట సాగు కాస్త ఆలస్యమైంది. దానికి తగినట్లుగా ఈ ఏడాది వాతావరణం కూడా సవ్యంగా లేనందు వల్ల కుంకుమ పూల సాగు పెద్దగా లాభదాయకంగా లేదంటున్నారు కశ్మీర్ రైతులు. వాతావరణ సరిగా లేనందుకు వల్ల పూల దిగుబడి తగ్గిందంటున్నారు. జమ్మూకాశ్మీర్‌లో కిష్టవర్, బడ్గావ్, శ్రీనగర్, పాంపోర్ ప్రాంతాల్లో కుంకుమ పూలు పూస్తాయి. ఈమధ్యకాలంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో కూడా కొంతమంది రైతులు కుంకుమ పూల సాగు ప్రారంభించారు.కుంకుమపూలు… అక్టోబర్ మొదటి వారంలో పెరుగుతాయి. నవంబర్ నాటికి అవి చేతికొస్తాయి. ప్రపంచంలో ఎక్కువగా కుంకుమ పూలను సాగుచేస్తున్న దేశం ఇరాన్. ఎప్పుడూ వివాదాలు, ఘర్షణలతో ఉండే ఇరాన్ కుంకుమ పూల పంటలో రాణిస్తోంది. ఇరాన్ తరువాత కుంకుమపూల సాగులో మన జమ్మూకాశ్మీరే. కాశ్మీర్‌లో పండే కుంకుమపూలకు ప్రపంచంలో మంచి డిమాండ్ ఉంది.
కుంకుమపువ్వును అమృతంగా భావిస్తారు. ఎర్ర బంగారం అని కూడా అంటారు. కుంకుమ పువ్వు (మధ్యలోని రేకలను)ను దేంట్లో వేసినా అది ఎరుపు రంగు నుంచి పసుపు రంగులోకి మారిపోతుంది. ఎర్రిని కుంకుమ పువ్వులో ఉండే ప్రత్యేకత అదే. బంగారం పసుపు రంగులోనే కదా ఉంటుంది. అందుకే కుంకుమపువ్వుని ఎర్ర బంగారం అంటారు. దానికి తగినట్లుగా ధరలో కూడా బంగారం కంటే ఎక్కువ రేటే మరి కుంకుమ పువ్వుది.


దీర్ఘకాలిక రోగాలను కుంకుపువ్వు తగ్గిస్తుంది. కుంకుమపువ్వు కాన్సర్ అంతు చూస్తుందంటారు. సుఖనిద్ర బాగా పట్టేలా చేస్తుంది, రక్తం పెరిగేలా చేస్తుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు రానివ్వదు. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది, మెదడుకు చురుకుదనాన్నిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుపుపరుస్తుంది, మహిళల్లో మూత్ర విసర్జన వ్యవస్థ సక్రమం చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులకు కుంకుమ పువ్వు మేలు చేస్తుంది, హృదయనాళ వ్యవస్థను బలపరుస్తుంది, దృష్టి లోపాలు రాకుండా చేస్తుంది.ఇలా చాలా ప్రయోజనాలు ఉండే కుంకుమ పువ్వు ఎర్ర బంగారంకాక మరేమిటీ చెప్పండి..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *