లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బైడెన్ వైట్ హౌస్ టీమ్ లోని కశ్మీర్ సంతతి మహిళకి ఇస్లామిస్ట్ సంస్థతో లింకులు

Published

on

Kashmiri-origin మరో మూడు రోజుల్లో డెమెక్రటిక్ నేత జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే, తన వైట్ హౌస్ టీమ్ లోకి కశ్మీరీ సంతతికి చెందిన సమీరా ఫజిలీని బైడెన్ సెలక్ట్ చేసుకున్నారు. యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరక్టర్‌గా సమీరా ఫజిలీని బైడెన్ నియమించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో సమీరా ఫజిలీ…ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అట్లాంటాలో ఎంగేజ్మెంట్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ డైరక్టర్ గా పనిచేశారు.

అయితే,ఇక్కడ చర్చనీయాంశమైన విషయం ఏంటంటే, సమీరా ఫజిలీ..కశ్మీర్ వేర్పాటువాదాన్ని కోరుకునే ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ స్టాండ్ విత్ కశ్మీర్(SWK)సభ్యురాలు. 2019ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్-370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన సమయంలో SWK సభ్యురాలిగా ఫజిలిని CAIR(Council on American-Islamic Relations)ప్రవేశపెట్టింది. ఇండియా నుంచి యునైట్ స్టేట్స్ నుండి యూరప్ వరకు ప్రపంచవ్యాప్తంగా నిరంకుశత్వం మరియు ఇస్లామోఫోబియా పెరుగుతున్నందున మనస్సాక్షి కలిగిన ప్రజలు బయటకు వచ్చి కాశ్మీర్ ప్రజలకు మద్దతు మరియు సంఘీభావం చూపించాలని మేము కోరుతున్నాము. మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టం మరియు ప్రజాస్వామ్యానికి మీ మద్దతును చూపించండి అని ఓ ప్రకటనలో ఫజిలీ పేర్కొన్నారు.

కాగా,SWK సంస్థకి పాకిస్తాన్ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. కశ్మీర్ లో భారతీయ మిలటరీ ఉండటాన్ని కూడా SWK వ్యతిరేకిస్తోంది. కశ్మీర్ లో భారత మిలటీరీ ఉనికిని ఓ వృత్తిగా ఈ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహీద్దీన్ సీనియర్ కమాండర్ రియాజ్ నైకూ ఎన్ కౌంటర్ గురించి కూడా ఇటీవల SWK ఓ ట్వీట్ చేసింది. అదేవిధంగా ఉగ్రవాదులతో సంబందాలున్న “అశియా ఆంద్రాబి” ని ఓ సామాజికరాజకీయ కార్యకర్తగా SWK అభివర్ణించింది. లష్కర్ ఏ తోయిబా వంటి చాలా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన “యాసిన్ మాలిక్” వంటి పలువురు ఉగ్రవాదులకు మద్దుతుగా నిలిచిన చరిత్ర SWKకి ఉంది.