చీటింగ్ కేసుపై స్పందించిన కత్తి కార్తీక

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kathi Karthika : దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న యాంకర్ కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కార్తీకపై కేసు నమోదు చేశారు పోలీసులు. భూవివాదం విషయంలో సెటిల్ చేస్తానంటూ కోటి రూపాయలు తీసుకుందని బాధితుడు ఆరోపించాడు. సెటిల్ మెంట్ చేసేందుకు డబ్బులు తీసుకుని తనను మోసం చేసిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.అమీన్ పూర్ దగ్గర 52 ఎకరాల భూమిని ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కత్తి కార్తీక మధ్యవర్తిత్వం చేసిందని ఫిర్యాదులో బాధితుడు తెలిపాడు. కార్తీక, ఆమె అనుచరులపై బంజారాహిల్స పోలీసులు కేసు నమోదు చేశారు. కోటి రూపాయల చీటింగ్ కేసుపై కార్తీక స్పందించింది.

రాజకీయ కక్షలతోనే తనపై కేసులు నమోదవుతున్నాయని కార్తీక ఆరోపిస్తున్నారు. అమీన్ పూర్ ల్యాండ్ ఇష్యూలో తాను ఎవరిని మోసం చేయలేదని ఆమె చెబుతున్నారు. భూ వ్యవహారంలో సదరు వ్యక్తికి రెండునెలల క్రితమే లీగల్ నోటీసులు పంపించానని చెప్పింది.ఇప్పుడు పోలీసులు తనపై ఎందుకు చీటింగ్ కేసు నమోదు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన తాను రాజకీయలను వీడేది లేదని తేల్చిచెప్పారు. రాజకీయాలంటేనే రకరకాల కుట్రలు జరుగుతున్నాయని ఆమె మీడియా ముందు వాపోయారు.

ఈ నెల 14వ తేదీ నామినేషన్ వేయగానే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే విషయం కూడా తనకు తెలియదన్నారు. ఎవరూ ఇలా చేయిస్తున్నారో వాస్తవాలు తనకు తెలియదని, ఇప్పుడేం నేను చెప్పలేనన్నారు. రెండు నెలల క్రితం లీగల్ నోటీసులు పంపించిన తర్వాత నామినేషన్ వేశాక ఇప్పుడా నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? అని కార్తీక ప్రశ్నించారు.రాజకీయాల్లో గట్టిగా బహుజన వాదాన్ని తీసుకెళ్తు పోరాడతానని.. కచ్చితంగా నాపై అన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, వాట్సాప్ కాల్ బెదిరింపులు వస్తున్నాయని ఆమె అన్నారు. ఇన్నిరోజులైనా దేనికైనా తాను లొంగడం లేదని ఇలాంటింది సృష్టించారని వాపోయింది. ఏదిఏమైనా భయపడేది లేదని, బహుజన పోరాటం జరిగి తీరుతుందని, గెలుపు తమ బహుజనులదేనని కత్తి కార్తీక స్పష్టం చేశారు.మరోవైపు కార్తీక అనుచరులు మాత్రం చీటింగ్ కేసును తప్పుబడుతున్నారు. ఇది కావాలనే చేస్తున్న రాజకీయం అని మండిపడుతున్నారు. కార్తీక ఎవరిని మోసం చేయలేదని అంటున్నారు. ఎవరెన్నీ ద్రుష్ప్రాచారం చేసినా దుబ్బాక జనం విశ్వసించరని, కార్తీకకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కార్తీక పోటీ చేస్తుందకే కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు.

Related Posts