Published
2 months agoon
CM KCR: సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం డిసెంబర్ 28న జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో సోమవారం ఉదయం 10గంటలకు వివాహం జరగనుంది. పెళ్లి ఏర్పాట్లను స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది. హైదరాబాద్ లోని రాంనగర్ కు చెందిన ఉడుముల జైన్ మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడితో వివాహం జరపనున్నారు.
పెళ్లి తంతు మొత్తం క్రైస్తవ సంప్రదాయంలోనే జరిపించనున్నారు. కాగా, వీరి ఎంగేజ్మెంట్ అక్టోబరులో విద్యానగర్ లోని ఓ హోటళ్లో జరిపించారు. ప్రత్యూష కుటుంబంతో తమకు చుట్టరికం కూడా ఉందని చరణ్ రెడ్డి బంధువులు చెబుతున్నారు. చరణ్ రెడ్డి అమ్మమ్మ గ్రామం పాటిగడ్డ కావడంతో ఇక్కడ వివాహం చేయనున్నారు.
డిసెంబర్ 27న బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో ప్రధానం నిర్వహించి, 28న వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానం కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు ప్రభుత్వ అధికారులు హాజరవుతారని వరుడి బంధువులు తెలిపారు.
పెళ్లైన మర్నాడే భర్త ఇంటిలో బంగారం,నగలు తీసుకుని వధువు పరార్
పెళ్ళి ప్రతిపాదన తిరస్కరించిందని టెకీపై దాడి చేసిన సెలూన్ లో పని చేసే వ్యక్తి
కలికాలం.. తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ.. మరి సంసారం ఎవరితో చేస్తుందో..
విషాదం : ఉదయం పెళ్లి, సాయంత్రానికి వరుడు మృతి
పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి 11కోట్లు నొక్కేసిన నకిలీ ఐపీఎస్ స్మృతి కేసులో మతిపోయే వాస్తవాలు
మరికొన్ని గంటల్లో వివాహం.. పెళ్లి కుమార్తె కిడ్నాప్