లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

హైదరాబాద్‌లో అలా జరిగితే.. రియల్‌ ఎస్టేట్‌ పడిపోద్ది : KCR

Published

on

ప్రశాంత హైదరాబాద్‌ కావాలా.. కల్లోల హైదరాబాద్‌ కావాలో..? నగర ప్రజలే తేల్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. హైదరాబాద్‌లో కల్లోలం చెలరేగితే.. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని అన్నారు కేసీఆర్. టీఎస్‌ బీపాస్‌ కావాలా? కర్ఫ్యూపాస్‌ కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు. జీహెచ్‌ఎంసీలో ఇతర పార్టీలు గెలిచినా ఉపయోగం ఉండదని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే జీహెచ్‌ఎంసీ అభివృద్ధి సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు.దేశంలో ఎన్నో నగరాల్లో ఎన్నో వరదలు వచ్చాయని, ఎక్కడా కూడా ప్రభుత్వం రూ.10వేలు సహాయం చెయ్యలేదని అన్నారు కేసీఆర్. అయితే ఎన్నికల కారణంగా.. SEC వరద సాయం నిలిపివేసిందని, కొందరి ఫిర్యాదులు కారణంగా అటువంటి పరిస్థితి ఏర్పడిందని, అయితే ఎన్నికల తర్వాత మిగిలిన వారికి వరద సాయం తప్పక అందజేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.


టాలీవుడ్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు..


ఇక ఇదే సమయంలో రాబోయే రోజుల్లో మూసీ నదితో గోదావరి నీటిని అనుసంధానించనున్నట్లు కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. బాపుఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు మూసీ నది మధ్యలో బోటింగ్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేని నగరంగా ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్‌ ట్రాక్‌ల నిర్మాణం చేపడతామని అన్నారు. హైదరాబాద్‌ను జీరో కార్బన్‌ సిటీగా మార్చాలన్నదే టీఆర్ఎస్ లక్ష్యం అని కేసీఆర్‌ అన్నారు.