లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

యువకులారా.. రెచ్చిపోయి ఓటేయకండి ఆలోచించండి: సీఎం కేసీఆర్

Published

on

పేరుపేరునా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేసినా సీఎం కేసీఆర్ ప్రసంగం మొదలుపెట్టారు.
ఎన్నికలు జరుగుతుంటాయి..
విచక్షణతో ఆలోచించండి.
పార్టీ, ప్రభుత్వం, నాయకుడు పనిచేసే తీరు, ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నారనేది గమనించాలి.
అలా వచ్చినప్పుడే మంచి పార్టీలు వస్తాయి.
హైదరాబాద్ చైతన్యవంతమైన నగరం, మంచి చెడులకు సాక్ష్యమైన నగరం
చాలా కష్టపడ్డాం. వాదాలు, ఉపవాదాలు, అపోహలు, అనుమానాలు అన్నీ దాటుకుని వచ్చాం.

చెప్పిందే చేశా:
2001లో ప్రారంభించి పదిహేనేళ్లు పోరాటం చేస్తే ఇలా చేయగలిగాం.
నీళ్లు రావని, పంటలు పండించలేరని హైదరాబాద్ లో ఒక్కరు కూడా ఉండరని విమర్శించారు.
టీఆర్ఎస్ పార్టీని అశేష ప్రజానీకం ఆశీర్వదించి పట్టంగడితే
తెలంగాణలో జరిగిన సభలకు ప్రపంచమంతా ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి.
రాష్ట్రం వచ్చిన రోజే చెప్పా.
గమ్యం చేరాం. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారుతుందని చెప్పాను.
ప్రముఖ జర్నలిస్టు కూడా సీఎంగా పనిచేయలేరేమోనని అనుకున్నాం. అంచనాలు తలకిందులు చేస్తూ మీరు పాలించి చూపించారు.
ఇప్పటివరకూ చాలా చర్చలు జరిగాయి.

అందరినీ సమానంగా చూశాం:
హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డే అనుకుని చూసుకున్నాం.
కొన్నేళ్లుగా ఎటువంటి గొడవలు లేకుండా చూశాం.
ఏడేళ్ల కిందట ఉన్న కరెంట్ పరిస్థితులను మార్చాం.
కేవలం ఏడెనిమిది మాసాల్లోనే కృషి పట్టుదలతో పరిస్థితులు మార్చాం.
కరెంట్ రెగ్యూలర్ గా రావడం తెలంగాణ తీసుకువచ్చిన తొలి విజయం

అపార్ట్‌మెంట్లో ఉండేవాళ్లకు నో వాటర్ బిల్
భారత్ లోని తలసరి ఆధాయంలో తెలంగాణ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటించింది.
టీఆర్ఎస్ ఏ నాడు పాక్షిక నిర్ణయాలు, పక్షపాత నిర్ణయాలు చేయలేదు.
ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచాం.
మిషన్ భగీరథ అనన్య సామాన్యంగా చేయగలిగాం. ఐదేళ్లలో చేయలేకపోతే ఓట్లు అడగలేమని చెప్పిన మగతనం ఉన్న పార్టీ.
హైదరాబాద్ తో సహా పల్లెలు, గ్రామాల్లో 95శాతం మంచి నీటి సమస్య లేకుండా చేశాం.
నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 24గంటల నీటి సదుపాయం తీసుకురావాలనేది నా కల.
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నుంచి ఇదే పనిలో ఉన్నాం. హైదరాబాద్ నగరంలో త్వరలోనే ఇది అమల్లోకి రానుంది.
నగర ప్రజలకు నీటి బిల్లు మినహాయింపును శాశ్వతం చేశాం. ఇది దేశంలోనే రెండో సారి.
హైదరాబాద్ అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి కూడా ఇది వర్తిస్తుంది.

ప్రతి పథకం సూపర్ హిట్:
టీఆర్ఎస్ ఏ పథకం చేపట్టినా ప్రతిపక్షం లేకుండా అందిస్తుంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో అమలు చేయని పథకం కంటివెలుగు.
దాదాపు 50-60లక్షల మందికి ఇది అందించాం.
మతం, కులాలకు అతీతంగా కళ్యాణలక్ష్మీ ఇచ్చాం.
కేసీఆర్ కిట్ నిరుపేద గర్భవతులకు ఆసరాగా నిలిచి కేసీఆర్ కిట్-సూపర్ హిట్
గుంట భూమి ఉన్న రైతుకు కూడా సహాయం అందుతుంది.
కులవృత్తులను ఆదుకున్నాం. గీత కార్మికులకు హైదరాబాద్ లో కళ్లు దుకాణాలు తెరిపించాం. గొర్రెల పంపకం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి యాదవ కుటుంబానికి గతంలో ఇచ్చినట్లుగానే మళ్లీ అందిస్తున్నాం.
దోబీ ఘాట్ లో కరెంట్ కావాలని అడిగారు. వారు వాడుకునే మోటార్లకు గానీ, ల్యాండ్స్ కు గానీ కరెంట్ బిల్లు కట్టకుండా ఏర్పాటు చేస్తామన్నారు.
వెయ్యి గురుకులాలు ప్రారంభించి పేద పిల్లలకు సహాయం చేస్తున్నాం.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరి క్షేమం గురించి ఆలోచించి పనిచేస్తుంది.
మీ కళ్ల ముందే ఈ సంక్షేమ పథకాలు సాక్ష్యామిస్తున్నాయి.
కరోనా వచ్చి కష్టకాలంలో ఇరుక్కుపోతే అన్ని రకాలుగా సాయం అందించాం.
తడబడకుండా బియ్యం, డబ్బు వీలైనంతగా సాయం చేస్తున్నాం.
ప్రభుత్వం ఏం చేస్తుంది.. లక్షణమేంటి.. వైఖరి ఏంటి.. ఒక్కసారి సమీక్షించుకోండి.

కేంద్రం వివక్ష చూపించింది:
హైదరాబాద్ లో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. కేంద్రం పట్టించుకోలేదు. ఇండియాలో ఉన్న ప్రధాన 5నగరాలను కూడా విస్మరించాయి.
గతంలో ఎప్పుడూ ఇలాంటి పనులు లేవు. మనం వాటిని కొనసాగించాలి.
వరదల నుంచి హైదరాబాద్ ను కాపాడుకోవాలి. సంవత్సరానికి దీనిక కోసం పది వేల కోట్లు కేటాయిస్తాం.
దీని కోసం మధ్య తరహా, దీర్ఘ కాలిక ప్రణాళిక వేసి కాపాడుకుందాం.

ప్రజలు సహకరించాలి:
హైదరాబాద్ ప్రాంతం చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన పరిశ్రమలన్నీ కాలుష్య కారకాలుగా మారాయి.
మెట్రో రైలు మరింత విస్తరించాలి. ఎయిర్ పోర్ట్ వరకూ దాన్ని విస్తరిస్తాం.
హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత అనుమతులు ఇచ్చి కాలుష్యం తగ్గే విధంగా చర్యలు తీసుకుంటాం.
చాలా నగరాలు ఆక్సిజన్ కొనుక్కుని బతుకుతున్నాయి. హైదరాబాద్ అలా కాకుండా చూసుకుందాం.
ప్రజలు కూడా సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది.
మూసీనదిని గోదావరితో అనుసంధానం చేసి హైదరాబాద్ కు అందిస్తాం.
హైదరాబాద్ నిర్మాణ బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చెబుతున్నా.

ఆశీర్వదించి గెలిపిస్తే మరింత మంచిగా:
గత ఆరేళ్లుగా శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.
పీడీ యాక్ట్ లు పెట్టి ముష్కరులకు, రౌడీలను అరికట్టాం.
హైదరాబాద్ లో ఉన్న సీసీ కెమెరాలు ప్రపంచంలో ఎక్కడా లేవు.
శ్రేష్ఠమైన, స్వేచ్ఛపూరిత హైదరాబాద్ కావాలి.
చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించాం.
ఈ రాష్ట్రంలో ప్రతి అంగుళం బాగుపడాలని కోరుకుంటున్నాం.
ఇవన్నీ ఆషామాషీగా జరిగే ఆలోచనలు కావాలి. గతంలో కానివన్నీ టీఆర్ఎస్ చేసి చూపించింది.
మీరు ఆశీర్వదించి గెలిపిస్తే మరింత మంచిగా చేస్తాం.

ప్రతి ఇంటికి పది వేల ఆర్థిక సహాయం:
ఇండియాలో వరదలు లేని నగరం లేదు. మద్రాస్ 21 రోజులు, ముంబైలో 15రోజులు, అహ్మదాబాద్ లో వరదలు, కోల్ కతాలో వరదలు దేశాన్ని అతలాకుతలం చేశాయి.
మంత్రులు మోకాళ్లలోతు నీళ్లలో తిరిగి పర్యవేక్షించారు.
ఈ బాధలన్నీ చూపిస్తూ ఆక్రందన వెళ్లగక్కుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
బతుకమ్మ, దసరా ముందు ఇలా జరగడం నుంచి ఆదుకోవాలని ప్రతి ఇంటికి సహాయం ఇచ్చే ప్రయత్నం చేశాం.
ఇచ్చే దగ్గర కిరికిరీ పెడతారా.. ఇది విచక్షా..
ఈ నగరంలో వరదలు వచ్చినప్పుడు రూ.650కోట్లు అందించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా.
అందుకే మీ సేవలో అప్లై చేసుకోమని వారికి సహాయం ఇచ్చాం.
ఎలక్షన్ నాలుగు రోజులు అయితే అయిపోతుంది.. కేసీఆర్ మాత్రం ఇక్కడే.
నగర ప్రజలకు హామీ ఇస్తున్నా.. వరద బాధితుల్లో మిగిలిన కుటుంబాలకు డిసెంబర్ 7నుంచి మళ్లీ ఇస్తాం.
మా పేదలకు మా బిడ్డలకు మరో రూ.300కోట్లు ఇచ్చేందుకు వెనుకడుగేయబోం.

బక్క కేసీఆర్‌ను కొట్టడానికి
బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంతమంది వస్తారా..
ప్రధానమంత్రిని సహాయం కావాలని అడిగాం. రూ.1350 కోట్లు కావాలంటే పైసా కూడా ఇవ్వలేదు. బెంగళూరుతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఇచ్చి మాకెందుకు ఇవ్వలేదు.
ఈ ఎన్నికలతో కర్రు కాల్చి వాత పెట్టాల్నో అర్థమవుతుంది.
వరదకు సాయం చేయాలంటే ఒక్కరు ముందుకు రాలేదు.
ఇప్పుడు వరదల్లా వస్తున్నారు.
ఈ బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంతమంది వస్తారా..
అన్నీ రాష్ట్రాల నుంచి వచ్చి కొట్టాలనుకుంటున్నారా..
తెలంగాణ బిడ్డ, మీ బిడ్డ, మానవత్వం ఉన్న వ్యక్తిగా కొన్ని కఠోరమైన వాస్తవాలు బయటపడ్డా.

కొత్త రాజకీయాలు రావాలి:
ఈ రెండు జాతీయ పార్టీలు ఫెయిలైయ్యాయి. ఇళ్లు లేని పేద ప్రజలు ఎందుకున్నారు.. కొత్త ఆలోచన రావాలి.
కొత్త ఆవిష్కరణ రావాలి. ఇంకా ఎన్ని రోజులు ఈ మూస రాజకీయాలు అని ప్రశ్నించా.
తెలంగాణ కోసం బయల్దేరినప్పుడు ఎవ్వడూ నమ్మలేం. ఎవ్వడ్ని నొక్కాలో వాడ్నే నొక్కా.
మాయమవుతాం అని బెదిరించినోళ్లు మాయమైపోయారు.
ఢిల్లీలో గజగజ వణుకుతున్నారు.. ఢిల్లీకి వస్తానేమోనని భయపడుతున్నారు.
వరదలా బురదలా వస్తున్నారు.. జీహెచ్ఎంసీ ఎన్నికలతోనే మీరు దానికి సమాధానం చెప్పాలి.

అడిగితే తప్పంటున్నారు:
ఎల్ఐసీని ఎందుకు అమ్ముకున్నారు. 30లక్షల కోట్ల ఆధాయం ఉంది. 40లక్షల మంది అకౌంట్ ఖాతాదారులు ఉన్నారు.
బీహెచ్ఐఎల్, రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారు.
దేశంలో అడిగితే తప్పు అవుతుంది.
ఇంతమంది వచ్చి మాయ చేస్తామంటున్నారు.

యూపీ సీఎం నీ పనిచూస్కో
ఉత్దరప్రదేశ్ సీఎం వచ్చి మనకు మంచి చేస్తా అంటున్నాడు. ఆరేళ్ల క్రితం మనం 13వ నెంబర్లో ఉంటే 5నెంబర్ కు వచ్చాం
25వ ర్యాంక్ ఆయన వచ్చి ఇక్కడ ఏదో చేస్తారంట.
వాళ్లది చక్కగా చూసుకోలేనేళ్లు మనల్ని బాగు చేస్తామంటున్నారు.

మోసగాళ్ల మాటలకు మోసపోకండి
ఈ నగరాన్ని కాపాడాలని మనవి చేస్తున్నా. శాంతియుత నగరమైతేనే వ్యాపారాలు జరుగుతాయి. బీపాస్ కావాలా.. కర్ఫ్యూ పాస్ కావాలా బిల్డర్ మిత్రులు ఆలోచించుకోవాలి.
ఈ సిటీ మనది. మనం కాపాడుకోవాలి.
హైదరాబాద్ లో శాంతి సామరస్యం ఉన్నప్పుడే అన్నీ సాధ్యమవుతాయి.
ఉడుముల్లా దూరి పిచ్చి పనులు చేయాలనుకుంటున్నారు. పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి నాలుగు మాటలు చెప్పిపోతారు.
ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉండేదెవరు.. ఇదే నాయకులు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసగాళ్ల మాటలకు మోసపోకండి.
బాధ్యతగల మంత్రులు ఇక్కడే ఉన్నారు.. వీళ్లతో పాటు నేను ఉండి పనిచేయాలి.
అంతేకానీ పక్క రాష్ట్రపోళ్లు కాదు.

మీ వాళ్లను మేమే ఆదుకున్నాం
హైదరాబాద్ శాంతియుతమైన నగరం.. చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి కరోనా టైంలో రాష్ట్ర సొంత ఖర్చులతో పంపించాం. ఇవి మీకు తెలుసా. మా శాంతిని కాపాడుకోవడం మా బాధ్యత. మీ పిచ్చి మాటలు విని నగరం పాడుచేసుకోలేం. మీకు విజ్ఞప్తి చేస్తున్నా.

మేధావులారా ఆలోచించండి
హైదరాబాద్ మేధావులకు ఇదే విజ్ఞప్తి. ఇంత గొప్ప ప్రదేశాన్ని రక్షించుకునే సమయం ఇది. దుష్టులకు, అశాంతికారకులకు అవకాశం ఇస్తారా.. హైదరాబాద్ అనేది వాస్తవం. వాళ్లు వస్తారు.. పోతారు మనం, మన పిల్లలు ఇక్కడే ఉంటారు. మన చరిత్రను కాపాడుకుందాం. ఐటీ, ఇండస్ట్రీల వారు, ఇంజినీర్లు ప్రతి ప్రొఫెషనల్ ఆలోచించండి. అది హర్షించదగ్గ విషయం కాదు.

సంవత్సరాలుగా మనం ఇక్కడే కలిసి ఉంటున్నాం. తెలంగాణ తీసుకువచ్చిన వ్యక్తిగా, సీఎంగా చెప్తున్నా. నగరంలో శాంతిని నెలకొల్పాలంటే వచ్చి ఓటేయండి. హైదరాబాద్ ను కాపాడుకోండి. తెలంగాణ సాధించిన వ్యక్తిగా, కుటుంబ పెద్దగా చెబుతున్నా.

పిచ్చి ప్రేలాపనకు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పోయి ఓటేస్తే నష్టపోతాం. భూములు విలువ పోతుంది. పిల్లలు భవిష్యత్, ఉజ్వల నగరాన్ని పాడుచేసుకోవద్దు. అందరం కలిసి కాపాడుకుందాం. మంచి అభ్యర్థులను ఉంచాం. పోయినసారి ఫలితాల కంటే మెరుగ్గా ఇచ్చి ఆశీర్వదించండి. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి డబ్బులు తీసుకొచ్చి పనులు చేస్తామని నేను చెబుతున్నా.

యువకులు మీరే గమనించాలి. భవిష్యత్ మీది. నన్ను కూడా తిడుతున్నారు. కేసీఆర్ ఎత్తుకుంటే దుమ్ము దుమ్ముగా కొడతాం. రాష్ట్రాన్ని నిర్వహించాలనే బాధ్యత మాది. మాకు ఢిల్లీలో బాస్ లు లేరు. తెలంగాణ ప్రజలే మాకు బాస్ లు. తెలంగాణ మా కల. చేతగాకనో, చేవలేకనో కాదు. మీ చిల్లర మాటలకు టెంప్ట్ కాం. 32జిల్లా పరిషత్ లు మేమే ఉన్నాం. 2, 3మినహాయిస్తే అన్నీ మేమే గెలిచాం. తెలంగాణ బిడ్డలుగా మమ్మల్ని నియమిస్తే పాలిస్తున్నాం. ఎవడో ఢిల్లీ నుంచి మమ్మల్ని నియమించలేదు.

నగరంలో ఉన్న ప్రొఫెషనల్స్, మేధావులు అందరికీ చెప్పాలి. చాలా మార్పులు వస్తున్నాయి. బ్రహ్మాండంగా విజయం సాధిస్తాం. నాలుగో తేదీ మనం విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఆరోజు నూతన హైదరాబాద్ ను నిర్మించుకుందాం. మీరంతా కారు గుర్తుకు ఓటేయండి అని కేసీఆర్ ముగించారు.

సీఎం మాటలకు సభకు వచ్చిన వారంతా జేజేలు కొట్టారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *