-
Home » సీఎం కేసీఆర్ రివ్యూ టైమ్ : బస్సు ఛార్జీలు పెంచుతారా
Telangana
సీఎం కేసీఆర్ రివ్యూ టైమ్ : బస్సు ఛార్జీలు పెంచుతారా
Published
1 month agoon

CM KCR Review Time : తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు సీఎం కేసీఆర్. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారాయన. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే.. ఈడబ్య్యుఎస్లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయ్. EWSతో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయన్నారు సీఎం.
ఆర్టీసీ అధికారులతో సమావేశం : –
EWSతో పాటు ఆర్టీసీ అధికారులతో కూడా సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్ డౌన్, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని కేసీఆర్‌కు తెలిపారు అధికారులు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం మరింత పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం లాంటి చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గే అవకాశం లేదని విన్నవించారు. క్రితంసారి బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర 67 రూపాయలు ఉండేదని… కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్‌కు 15 రూపాయలు పెరిగిందని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు.
ఆర్టీసీకి సహాయం అందించాలి లేదా ఛార్జీలు పెంచాలి : –
రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలని.. బస్సు చార్జీలు పెంచాలని… ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైందని… ప్రభుత్వం అందించిన సాయం.. ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని ముఖ్యమంత్రికి తెలిపారు అధికారులు. ఏపీకి బస్సులు తిప్పడం వల్ల మంచి ఫలితం వచ్చిందని… ఆక్యుపెన్సీ శాతం 58 శాతానికి చేరుకుందని అన్నారు. క్రమంగా ఇది పెరుగుతున్నదని… దీనివల్ల రోజుకు 9 కోట్ల ఆదాయం సమకూరుతున్నదని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. అయితే, లాక్ డౌన్ మిగిల్చిన నష్టాలు, పాత అప్పులు ఇంకా గుదిబండగానే ఉన్నాయని తెలిపారు.
కార్గో సర్వీసులు విజయవంతం : –
ఆర్టీసీలో కార్గో సర్వీసులు విజయవంతం అయ్యాయని, ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని అధికారులను అభినందించారు సీఎం కేసీఆర్. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్శిళ్లను గమ్యానికి చేరవేశారని, దీనివల్ల ఆర్టీసికి 22.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు సీఎం. ప్రజలు కూడా ఆర్టీసీ కార్గో సేవల పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారన్నారు. ఈ విషయంపై ఆర్టీసీ కార్గో సేవల స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్ ను ప్రశంసించారు. ఆర్టీసీ కార్గో ద్వారా పంపిన పార్సిళ్లు సకాలంలో, సురక్షితంగా గమ్యం చేరుతాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు సీఎం. అటు మారుమూల ప్రాంతాలకు, ఇటు నగరంలోని ఇంటింటికి డోర్ డెలివరీ చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు, ప్రయాణీకులకు సేవలు అందించాలని సీఎం పిలుపునిచ్చారు.
You may like
-
ఎమ్మెల్సీ ఎన్నిక..మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్
-
ధరణి సమస్యలపై సీఎం కేసీఆర్ ఫోకస్.. నేడు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష
-
దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.2.5లక్షలు, ప్రోత్సాహక నగదుని భారీగా పెంచిన ప్రభుత్వం
-
భారత ఉద్యమకారిణికి అమెరికా ప్రతిష్టాత్మక పురస్కారం
-
ఆర్టీసీ సమ్మె, నిలిచిపోనున్న బస్సులు!
-
కేంద్రం గుడ్ న్యూస్ : సామాన్యులకు కరోనా వ్యాక్సిన్, ఎప్పటి నుంచి

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకా రూ. 250కే!

మద్యం మత్తులో వాహనాలను ఢీ కొట్టిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్..

పెళ్లిళ్లో మద్యానికి నో చెప్పే వధువుకు నగదు బహుమతి

అనసూయ అదరగొట్టేసింది.. ఇక సోషల్ మీడియా షేకే..

ట్రాఫిక్ పోలీసులు రూ. 500 ఫైన్, మంగళసూత్రం ఇచ్చిన మహిళ..ఎందుకు ?

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

ఐశ్వర్యా రాజ్ భకుని ఫొటోస్

నేచురల్ బ్యూటీ సుభిక్ష ఫొటోస్

సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్లో స్టార్స్ సందడి!

బోధన్ అడ్రస్‌తో బంగ్లాదేశీయుల పాస్‌పోర్టులు

ఒక్కో ఫోన్ నెంబర్‌పై నాలుగు వాక్సినేషన్ రిజిస్ట్రేషన్లు

కారు టైరును స్వయంగా మార్చిన కలెక్టర్

అంతరిక్షయానంలో సరికొత్త ఇస్రో హిస్టరీ
