అగ్రి బిల్లు.. తేనె పూసిన కత్తిలాంటి లాంటిది : కేసీఆర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోన్న వ్యవసాయ బిల్లు అన్నదాతల నోట్లో మట్టికొట్టేలా ఉందని విమర్శించారు సీఎం కేసీఆర్. కార్పొరేట్‌ రాబందువులు దేశమంతా విస్తరించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని దుయ్యబట్టారు. రాజ్యసభలో అగ్రి బిల్లును వ్యతిరేకిస్తామన్నారు.కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశ‌పెట్టిన వ్యవ‌సాయ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్రి బిల్లు తేనె పూసిన కత్తిలాంటి లాంటిదని విమర్శించారు. రైతులను దెబ్బ తీసి.. కార్పొరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉంద‌ని ఆరోపించారు కేసీఆర్. రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారన్న సీఎం. అన్నదాతలు తమకున్న కొద్దిపాటి సరుకును రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యంకాదన్నారు. రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్‌ ఎంపీలను ఆదేశించారు.ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉంది. దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని విమర్శించారు సీఎం. మన దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతుంటే. సుంకం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు కేసీఆర్.రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తోందని మండిపడ్డారు టీఆర్ఎస్‌ ఎంపీలు. కేంద్రం ప్రవేశపెట్టే అగ్రి బిల్లును పార్లమెంట్‌లో అడ్డుకుంటామన్నారు ఎంపీలు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని టీఆర్ఎస్‌ విమర్శించింది. అన్నదాతలకు నష్టం చేసే బిల్లులకు తమ మద్దతు ఉండబోదని స్పష్టం చేసింది.

Related Posts