keerthi case police speed up enquiry

తల్లిని చంపిన కూతురు కేసు : కీర్తి ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లిని చంపిన కూతురు కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ కేసులో కీర్తి రెడ్డి ప్రియుడు,

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లిని చంపిన కూతురు కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ కేసులో కీర్తి రెడ్డి ప్రియుడు, కీలక నిందితుడు శశిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడు శశితో కలిసి తల్లి రజితను కీర్తి రెడ్డి మర్డర్ చేసిన సంగతి తెలిసిందే. పెళ్లికి నిరాకరించిందని తల్లి రజితను ప్రియుడు శశి సాయంతో కీర్తి హత్య చేసింది. ఈ కేసులో నిందితులు కీర్తి రెడ్డి, శశి, బాల్ రెడ్డిలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

కీర్తి కుటుంబ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఆమె ఆస్తిపై కన్నేసిన శశికుమార్‌ ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకుని ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత కీర్తి తల్లి రజితను చంపేందుకు ప్రేరేపించాడు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల పుటేజీలు, సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. 

మంగళవారం నిందితులను మహబూబ్‌నగర్‌ తీసుకెళ్లిన పోలీసులు అక్కడ కీర్తికి అబార్షన్‌ చేసిన వైద్యులను విచారించినట్లు సమాచారం. ప్రధాన నిందితులు కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

అక్టోబర్ 19న హయత్ నగర్‌లోని మునగనూరు గ్రామంలో వెలుగు చూసిన దారుణ ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రేమ పేరుతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దని తల్లి రజిత చెప్పడమే నేరమైంది. ఈ నెల 19న ప్రియుడు శశిని ఇంటికి పిలిపించుకున్న కీర్తి… తల్లి రజితను చంపేసింది. రజితను అడ్డు తొలగిస్తే కీర్తిని పెళ్లి చేసుకోవచ్చని, ఆస్తి దక్కించుకోవచ్చని శశికుమార్ ప్లాన్ వేశాడని పోలీసులు భావిస్తున్నారు.

మూడు రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకుని ప్రియుడితో రాసలీలలు సాగించింది కీర్తి. శవం దుర్వాసన రావడంతో అర్ధరాత్రి వేళ కారులో తీసుకెళ్లి యాదాద్రి జిల్లా రామన్నపేట సమీపంలోని తుమ్మలగూడెం వద్ద రైల్వేట్రాక్‌పై పడేసింది. తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి రాగా..భార్య రజిత కనిపించకపోవడంతో అనుమానంతో కీర్తిని గట్టిగా నిలదీశాడు. దీంతో తన తండ్రి తాగొచ్చి రోజూ కొట్టడం వల్లే తల్లి ఎక్కడికో వెళ్లిపోయిందని హయత్‌నగర్ పోలీసులకు కీర్తి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగుచూసింది.

READ  మోడల్ జెసికా లాల్ హత్య కేసు దోషి విడుదల

Related Posts